Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రచయితగా కెరియర్ మొదలు పెట్టి దర్శకులుగా మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. హరీష్ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా హరీష్ శంకర్ కెరియర్ కి షాక్ ఇచ్చింది. మళ్లీ తర్వాత పూరి జగన్నాథ్ దగ్గర చిరుత,బుజ్జిగాడు సినిమాలకు పనిచేశాడు. ఒకసారి డైరెక్టర్ అయిపోయిన తర్వాత మరో సినిమాకి అసిస్టెంట్ గా చేయాలి అసోసియేట్ గా చేయాలి అని ఎవరు అనుకోరు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఆ రెండు సినిమాలకి పని చేసిన తర్వాత మళ్లీ రవితేజ అవకాశం ఇవ్వడంతో మిరపకాయ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
ఆల్ టైం ఇండస్ట్రీ హిట్
హరీష్ శంకర్ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఒక సినిమాకి కొంత కాలం పాటు పనిచేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పేరు వేయలేకపోతున్నామంటే హరీష్ బాధపడిన సందర్భంగా బాధాకరమని చెప్పాలి. మొత్తానికి గబ్బర్ సింగ్ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను హరీష్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ వర్క్ కు ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి ఏమి కోరుకుంటారో వాటన్నిటిని పుష్కలంగా చూపించి సక్సెస్ సాధించాడు. ఈ సినిమా తర్వాత మెగా హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. దువ్వాడ జగన్నాథం, గద్దల కొండ గణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలు మెగా హీరోస్ తో చేశాడు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ తో హరీష్ శంకర్ సినిమా చేయలేదు.
చరణ్ తో అలాంటి సినిమా
ఒకవేళ హరీష్ శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి వస్తే ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకుంటారు అని అందరికీ ఒక డౌట్ ఉంది. ఇకపోతే నిన్న జరిగిన జింఖానా అని సినిమా ఈవెంట్ కు హాజరు అయ్యాడు హరీష్ శంకర్. ఆ ఈవెంట్ లో ఒక బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి అంటే ఏ హీరోతో చేస్తారు అని యాంకర్ అడగగా, చాలామంది క్రౌడ్ అంతా రవితేజ అని చెప్పుకొచ్చారు. కానీ హరీష్ శంకర్ మాత్రం నన్ను అడిగారు కదా మీరు ఎందుకు ఆన్సర్ చెప్తారు. నేను ఒకవేళ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి అనుకుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేస్తాను అని చెప్పుకొచ్చాడు. హరీష్ చెప్పిన ఈ మాటలు వింటుంటేనే ఆ ఊహ చాలా బాగుంది. నిజంగా అలాంటి సినిమా చరణ్ తో చేసినట్లయితే వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు.
Also Read : Karthik Subbaraj : పిజ్జా సినిమా ఇప్పుడు వస్తే, హిట్ అవుతుందో లేదో చెప్పలేం