BigTV English

OTT Movie : చనిపోయిన వాడు హత్యలెలా చేస్తున్నాడబ్బా… 242 ఐక్యూ ఉన్న డిటెక్టివ్ కే అంతుచిక్కని కేసు

OTT Movie : చనిపోయిన వాడు హత్యలెలా చేస్తున్నాడబ్బా… 242 ఐక్యూ ఉన్న డిటెక్టివ్ కే అంతుచిక్కని కేసు

OTT Movie : ఓటీటీలో వెబ్ సిరీస్ ల సందడి నడుస్తోంది. వీటికి అభిమానులు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. థియేటర్లతో సంబంధం లేకుండా ఇవి నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో, ప్రపంచంలోనే అత్యంత తెలివైన అమ్మాయి, అంతే తెలివితేటలు ఉన్న ఒక కిల్లర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలను చూస్తే మెంటలెక్కిపోవడం పక్కా. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఆంటోనియా స్కాట్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆమెకి IQ 242 ఉండటంతో, అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటుంది. ‘రెడ్ క్వీన్’ అనే సీక్రెట్ ఏజెన్సీలో ఆమె ఉద్యోగం చేస్తూ ఉండేది. ఆమె తెలివితేటలకు ‘రెడ్ క్వీన్’ బృందం  సన్మానం కూడా చేసి ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఉద్యోగం మానేసి  ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో స్పెయిన్‌లో, ఒక ధనవంతుడి కొడుకును, ఒక కిల్లర్ దారుణంగా హత్య చేస్తాడు.  ఇదే సమయంలో మరొక వ్యాపారవేత్త కుమార్తె కూడా కిడ్నాప్ అవుతుంది. ఈ రెండు సంఘటనలను పరిష్కరించడానికి ‘రెడ్ క్వీన్’సంస్థ ముందుకు వస్తుంది. ఆంటోనియా మాజీ బాస్ ఆమెను తిరిగి రంగంలోకి తీసుకురావడానికి, జాన్ అనే పోలీస్ అధికారిని నియమిస్తాడు. జాన్ ఇప్పుడు క్రమశిక్షణ సమస్యల కారణంగా ఉద్యోగం నుండి తొలగించబడే పరిస్థితిలో ఉంటాడు.


ఆంటోనియా, జాన్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నా, వారు కలిసి పనిచేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ క్రూరమైన సీరియల్ కిల్లర్‌ను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అతను చాకచక్యంగా మనుషులను ఎంచుకుని హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆంటోనియాకు తన గతంలో జరిగిన కొన్ని రహస్యాలు తెలుస్తాయి. ఇవి ఆమె డీల్ చేస్తున్న ప్రస్తుత కేసుతో ముడిపడి ఉంటాయి. అయినా ఆ కిల్లర్ వీళ్ళ నుంచి తప్పించుకుని ఎలా హత్యలు చేస్తున్నాడనేది, ఆంటోనియా IQ పవర్ కి కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. చివరికి ఆంటోనియా తన తెలివితేటలతో, ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటుందా ? కిల్లర్ కి ఆంటోనియా కన్నా IQ పవర్ ఎక్కువగా ఉంటుందా ? ఆ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఫైట్లూ లేవు, లవ్వూ లేదు… ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘రెడ్ క్వీన్’ (Red Queen). ఈ సిరీస్ జువాన్ గోమెజ్-జురాడో రాసిన నవల ఆధారంగా కోల్డో సెర్రా దర్శకత్వం వాహంచారు. ఇందులో విక్కీ లుయెంగో, హోవిక్ కెచ్కేరియన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

OTT Movie : అర్ధరాత్రి వింత శబ్దాలు… మనుషులతో బలవంతంగా వికృత జీవి ఆ పని… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

Big Stories

×