IPL 2025 – BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నిరవధికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా యుద్ధం ఆగిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఐపిఎల్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్ యాజమాన్యం కూడా కసరత్తులు చేస్తోంది. చర్చలు జరుపుతోంది.
Also Read: Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ప్రతిరోజు రెండు మ్యాచ్ లు
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కొత్త షెడ్యూల్ పై కీలక అప్డేట్ వచ్చింది. 10 ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). మంగళవారం రోజున.. 10 ఫ్రాంచైజీలు… సమావేశం కావాలని.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అలాగే ప్లేయర్ల ను కూడా… సిద్ధం చేయాలని తెలిపింది.ఈ నేపథ్యంలో నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ టోర్నమెంట్లో మరో 16 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మళ్లీ ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ఈ 16 మ్యాచ్లను త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. మే 30 లోపు… మ్యాచ్లను ఫినిష్ చేసి… ఐపీఎల్ 2025 కు ముగింపు పలకనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇకపై ప్రతిరోజు రెండు మ్యాచ్లు నిర్వహించాలని అనుకుంటున్నారు. శని అలాగే ఆదివారాలలో మాత్రమే డబుల్ హేడర్ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఇకపై రీ షెడ్యూల్లో… ప్రతిరోజు రెండు మ్యాచ్లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రోజున షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పది ఫ్రాంచైజీలా ప్లేయర్లను.. అసెంబుల్ కావాలని.. ఆదేశాలు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పై బిగ్ అప్డేట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం మే 16వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఫైనల్ మ్యాచ్ మే 30వ తేదీన నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్, చెన్నై అలాగే బెంగళూరు వేదికలలో ఈ మ్యాచ్లను నిర్వహించాలని అనుకుంటున్నారు. గతంలో మే 25వ తేదీన ఫైనల్… జరిగేది. కానీ ఇప్పుడు ఐదు రోజులపాటు ఈ టోర్నమెంట్ గడువును పెంచారు. అంటే అంటే మే 16వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. మే 30వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఎక్కడ ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: IPL 2025 – BCCI: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్.. ప్రతిరోజు రెండు మ్యాచ్ లు, 8 రోజుల్లోనే ఫినిష్
🚨 BCCI TELLS IPL FRANCHISES TO ASSEMBLE PLAYERS BY TUESDAY 🚨
– BCCI plans double headers in the revised schedule in the hope to finish IPL 2025 by May 25. (Express Sports). pic.twitter.com/9jo1mx5U1z
— Tanuj (@ImTanujSingh) May 11, 2025