IPL 2026: రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ నితీష్ రాణా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆటతో పాటు సోషల్ మీడియాలోనూ తరచు ఆక్టివ్ గా ఉంటాడు నితీష్ రానా. తనకు సంబంధించిన విషయాలను ఎల్లప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపిఎల్ 2025 మెగా వేలంలో రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు ఉండగా.. దాదాపు మూడు రెట్లకు కొనుగోలు చేసింది.
Also Read: Ravindra Jadeja: రేపు నైట్ వస్తావా? జడేజాకు లేడీ క్రికెటర్ బంపర్ ఆఫర్ ?
ఇతడు గత సీజన్ లో కలకత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. ఇతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ కనిపించింది. ఇక చివరకు రాజస్థాన్ నితీష్ రాణా ని కొనుగోలు చేసింది. అవసరమైన సమయంలో వేగంగా బ్యాటింగ్ చేయడం ద్వారా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా మంచి గుర్తింపు పొందాడు నితీష్ రానా. అయితే ఐపీఎల్ 2025 సీజన్ కి ముందు మెగా వేలంలో ఒక్కో బ్రాంచ్ కి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపిఎల్ పాలకవర్గం అనుమతించింది.
ఈ క్రమంలో 2025 సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కలకత్తా నైట్ రైడర్స్.. నితీష్ రానాని జట్టు నుండి రిలీజ్ చేసింది. అయితే తనను కేకేఆర్ అట్టిపెట్టుకుంటుందని మొదట ఆశాభావం వ్యక్తం చేశాడు నితీష్ రానా. కానీ కలకత్తా యాజమాన్యం అతడిని రిలీజ్ చేసింది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపిఎల్ ప్రారంభమైన సంవత్సరంలోనే ఛాంపియన్ గా అవతరించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతోంది.
తాజా సీజన్ లో మరింత దారుణ ప్రదర్శన కనబరిచింది. గొప్ప ప్లేయర్లను వేలంలో వదిలేసుకొని.. ఉన్న వాళ్లతో అద్భుతం చేయాలని అనుకుంది. కానీ ఈ సీజన్ లో గ్రూప్ నుండే ఇంటికి దారి పట్టింది. ఈ సీజన్ లో 14 మ్యాచులు ఆడిన ఆర్ఆర్.. కేవలం నాలుగు మ్యాచ్లలో గెలుపొంది, పది మ్యాచ్లలో ఓడిపోయింది. అలాగే అజింక్యా రహానే సారధ్యంలోని కేకేఆర్ జట్టు కూడా 14 మ్యాచ్లలో ఐదు గెలుపొంది.. ఏడు మ్యాచ్లలో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.
ఇలా కలకత్తా జట్టు కూడా ప్లే ఆఫ్ కి అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో రాబోయే వేలంలో కలకత్తా, రాజస్థాన్ ఫ్రాంచైజీలు వారి జట్టులోని కీలక ఆటగాళ్లకు షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 కి వెంకటేష్ అయ్యర్ ని రాజస్థాన్ రాయల్స్ కి అప్పగించి.. సంజూ శాంసన్, నితీష్ రానా ని కలకత్తా జట్టులోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
Also Read: Gary Kirsten: యువరాజ్ కు తెలియదు.. కాపాడింది ధోనీనే.. యోగరాజ్ ఇజ్జత్ తీసిన గ్యారీ క్రిస్టెన్
ఐపీఎల్ 2026 మేపద్యంలో ట్రేడింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈసారి మెగా వేలం ఉండదు కాబట్టి.. ట్రేడింగ్ ప్రకారం ఒకరినొకరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు ప్లేయర్లను తీసుకునేందుకు 20 కోట్లకు పైగా ధర వెచ్చించిన వెంకటేష్ అయ్యర్ ని ఇవ్వాలని ప్లాన్ చేస్తుందట కలకత్తా జట్టు. సంజూ, నితీష్ రానా ని తీసుకోవాలని షారుక్ ఖాన్ భారీ ప్లాన్ చేసినట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.