BigTV English

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

IPL franchises in dispute over retention numbers ahead of IPL 2025 auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం.. ఫ్యాన్స్ ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లు అన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పైన అందరి దృష్టి పడింది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కంటే ముందు మెగా వేలం జరగబోతుంది. చాలా రోజుల తర్వాత మెగా వేలం నిర్వహిస్తున్న నేపథ్యంలో… చాలామంది ప్లేయర్లు… తమ జట్లను మారనున్నారు.


రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, లాంటి కీలక ప్లేయర్లు కూడా.. ఈసారి వేలంలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో.. ఈ స్టార్ ప్లేయర్లు ఎంత మేరకు ధర పలుకుతారు అనే దానిపై అందరిలోనూ చర్చ జరుగుతోంది. అయితే ఈ మెగా వేలం నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో జరిగే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మెగా వేలం దుబాయ్ లో జరిగే ఛాన్స్ ఉంది.

IPL franchises in dispute over retention numbers ahead of IPL 2025 auction

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బిసిసిఐ అధికారులు. ఈ మెగా వేలం నిర్వహించే ముందు..ఐపీఎల్ లోని 10 జట్ల యాజమాన్యాలతో కూడా బీసీసీ అధికారులు చర్చించారు. మెగా వేలంలో ఈసారి అమలు చేసే కొత్త రూల్స్ గురించి కూడా చర్చించారు ముఖ్యంగా రిటెన్షన్ పాలసీ గురించి కీలక చర్చ జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇదే అంశంపై తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.


Also Read: IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

ఈ సారి 4+2 నిబంధనను తీసుకురాబోతుందట బీసీసీఐ పాలకమండలి. ఈ రూల్ ప్రకారం… రిటెన్షన్ కింద నలుగురు ప్లేయర్లను, అలాగే రైట్ టు మ్యాచ్ ద్వారా ఇద్దరు ప్లేయర్లను ఎంచుకునే ఛాన్స్… ఐపీఎల్ టీమ్లకు.. ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే… మొత్తం ఆరుగురు ప్లేయర్లను ప్రతి ఫ్రాంచైజీ… అంటి పెట్టుకోవచ్చు అన్నమాట.

Also Read: WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

అయితే ఇందులో నలుగురిని నేరుగా రిటైన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇద్దరిని వేలంలో రైట్ టు మ్యాచ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందట. అంతేకాదు ఇందులో అన్ క్యాప్డ్ ప్లేయర్లు కూడా.. ఉంటారని సమాచారం. వాళ్లను కూడా జట్లు కొనాల్సి ఉంటుందట. అయితే దీని వల్ల అన్ని జట్లు కీలక ప్లేయర్లను… తమ వద్దే అంటి పెట్టుకోవచ్చని సమాచారం. దాని ద్వారా ప్రస్తుత జట్లన్నీ సేఫ్ అవు తాయి. బలమైన ఆటగాళ్ళను తమ వద్ద.. ఉంచుకోగలుగుతాయి. మరి ఈ కొత్త రూల్స్ నిజంగానే అమలు చేస్తుందా… లేక వేరే కొత్త రూల్స్ పెడుతుందా అనేది బిసిసిఐ చేతుల్లో ఉంటుంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×