BigTV English

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

 


Rishabh Pant Offers Prayers Before Walking Out To Bat on Day 3 of IND vs BAN 1st Test 2024: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నై వేదికగా తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తొలి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో రిషబ్ పంత్ చేసిన పూజలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో అట్టర్ ప్లాప్ అయిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ తో రాణించాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో… తన బ్యాట్ అలాగే హెల్మెట్ కు ప్రత్యేక పూజలు చేశాడు.

ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు… చాలామంది క్రికెటర్లు గ్రౌండ్ మొక్కి లోపలికి వెళ్తారు. కానీ పంత్ మాత్రం అలా చేయలేదు. డ్రెస్సింగ్ రూమ్ లోనే… తన బ్యాట్ అలాగే హెల్మెట్ ను దేవుడి ఫోటో ముందు ఉంచి పూజలు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చాడు రిషబ్ పంత్. అయితే రెండో ఇన్నింగ్స్ కంటే ముందు ఇలాంటి పని చేశాడు.


Rishabh Pant Offers Prayers Before Walking Out To Bat on Day 3 of IND vs BAN 1st Test 2024

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే ఈ సంఘటన చూసిన కొంతమంది.. ఇలా పూజలు చేయడం వల్లే రెండవ ఇన్నింగ్స్ లో పంత్… సెంచరీ చేశాడని అంటున్నారు. లేకపోతే డక్ అవుట్ అయ్యేవాడని సెటైర్లు పేర్చుతున్నారు. అవి దేవుడి పూజలు కాదని… క్షుద్ర పూజలని మరి కొంతమంది… కామెంట్స్ చేయడం జరుగుతోంది. ఏది ఏమైనా ఆ పూజలు మాత్రం ఫలించాయని మరి కొంతమంది అంటున్నారు.

Also Read: IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

అయితే ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్… కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చేయగలిగాడు. కానీ రెండవ ఇన్నింగ్స్ వచ్చేసరికి… 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.కేవలం 128 బంతుల్లోనే.. 109 పరుగులు చేశాడు పంత్. ఇందులో 13 ఫోర్లు నాలుగు, శిక్షలు కూడా ఉన్నాయి. రిషబ్ పంత్ రెండవ ఇన్నింగ్స్ లో ఆడిన సెంచరీ కారణంగా భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు టీమిండియా ఉంచగలిగింది. ఇది ఇలా ఉండగా రెండవ ఇన్నింగ్స్ లో…. 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది టీమిండియా. దీంతో… రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్… మూడవరోజు ఆట ముగిసేసారికి.. నాలుగు వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే మరో 354 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని… బంగ్లాదేశ్ ఛేదించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే టాప్ ఆర్డర్ మొత్తం.. విఫలమై పెవిలియన్కు చేరింది. కేవలం నజ్ముల్, షాకీబ్ మాత్రమే క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా బౌలర్ల దాటికి ఈ ఇద్దరు కూడా ఇవాళ అవుట్ ఛాన్స్ ఉందని చెప్తున్నారు క్రీడా విశ్లేషకులు. మరి ఇవాళ మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి. కాగా యాక్సిడెంట్ తర్వాత… టెస్టుల్లో.. ఈ సిరీస్ తోనే రీఎంట్రీ ఇచ్చాడు పంత్.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×