Indian Railways: ఈ రోజుల్లో కుర్రాళ్లు డేంజరస్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం లైఫ్ ను రిస్క్ లో పెడుతున్నారు. ముఖ్యంగా కదులుతున్న రైళ్లలో రకరకాల ప్రమాదకర పనులు చేస్తున్నారు. డేంజరస్ స్టంట్లు చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా, కుర్రాళ్లు ఇప్పటికీ మారడం లేదు. తాజాగా ఓ యువకుడు కదులుతున్న రైలు విండోను పట్టుకుని వేలాడుతూ ప్రమాదకరంగా రీతిలో స్టంట్ చేశాడు. చేయి జారినా, అదృష్టం బాగుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
యూపీలో యువకుడి డేంజర్ స్టంట్
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాస్గంజ్- కాన్ఫూర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. కాస్గంజ్ ప్రాంతంలో కొంత మంది కుర్రాళ్లు రైలు ఎక్కారు. అందులో ఓ యువకుడు విండోను పట్టుకుని వేలాడుతూ డేంజరస్ స్టంట్ చేశారు. అతడిని మరికొంత మంది కుర్రాళ్లు వీడియో తీస్తూ ఎంకరేజ్ చేశారు. విండోకు వేలాడుతూ కొంత దూరం ప్రయాణం చేశాడు. ఆ తర్వాత రైలు కాస్త స్లో కావడంతో రైలు దిగేందుకు ప్రయత్నించాడు. దిగే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి ట్రాక్ పక్కన ఉన్న కంకరలో పల్టీలు కొట్టాడు. కాస్త లోపలికి పడిపోయి ఉంటూ రైలు కింద పడి ముక్కలు ముక్కలయ్యేవాడు. కానీ, లేచిన బాగుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
A young guy fell from a moving train while performing a stunt for a Reel later people saved him somehow, Kasganj to Kanpur
pic.twitter.com/L9fMlOsHtE— Ghar Ke Kalesh (@gharkekalesh) March 10, 2025
పోలీసులు అదుపులో కుర్రాడు
ఇక సోషల్ మీడియాలో రీల్స్ కోసం డేంజరస్ స్టంట్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న యువకుడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో రైల్వే పోలీసులు దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. సదరు యువకుడితో పాటు అతడితో ఉన్నవాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. రైల్వే చట్టాల ప్రకారం ఈ ఘటనలో ఉన్న వారందరికీ కఠిన శిక్ష పడే అవకాశం ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, రైలు పట్టాల మీద ఫోటోలు దిగుతూ పలువురు ప్రమాదాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు అలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే స్టేషన్లలో, రైల్వే పట్టాల మీద సెల్పీలు దిగినా, రీల్స్ చేసిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ రీల్స్ చేస్తూనే ఉన్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
Read Also: ఇక నుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగవు, కారణం ఏంటో తెలుసా?
డేంజరస్ స్టంట్ పై నెటిజన్ల ఆగ్రహం
యూపీలో కుర్రాడు చేసిన డేంజర్ స్టంట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అటు ఇటు అయినా ప్రాణాలు పోయేవని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను కోరుతున్నారు. కొంత మందిని జైలుకు పంపిస్తేనే మిగతా వారికి బుద్ది వస్తుందంటున్నారు.
Read Also: హోలీ వేళ ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు!