E-Paper
Advertisement

IPL : టార్గెట్ చిన్నదే.. లక్నో ఫెయిల్.. బెంగళూరు విజయం..

IPL : టార్గెట్ చిన్నదే.. లక్నో ఫెయిల్.. బెంగళూరు విజయం..
Advertisement

IPL : తక్కువ స్కోర్ చేసినా బెంగళూరు కాపాడుకుంది. చిన్న టార్గెట్ ను చేధించలేక లక్నో చేతులెత్తేసింది. దీంతో బెంగళూరు 18 పరుగుల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కెప్టెన్ డుప్లెసిస్ (44), విరాట్ కోహ్లీ (31) మంచి ఆరంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత 28 పరుగుల తేడాతో 4 వికెట్లు పడటంతో బెంగళూరు కష్టాల్లో పడింది. కోహ్లీ అవుటైన తర్వాత అనూజ్ రావత్ (9), గ్లెన్ మాక్స్ వెల్ (4), సుయాష్ ప్రభు దేశాయ్ (6) తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ (16) మినహా మరో బ్యాటర్ రెండెంకల స్కోర్ చేయలేదు. దీంతో బెంగళూరు 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది.

లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నవీన్ హుల్ హక్ 3 వికెట్లు, రవి బిష్టోయ్ , అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. కృష్ణప్ప గౌతమ్ కు ఒక వికెట్ దక్కింది.

Advertisement

127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో రెండో బంతికే మేయర్స్ (0) వికెట్ ను కోల్పోయింది. ఆయుష్ బదోని (4), కృనాల్ పాండ్యా (14), దీపక్ హుడా (1), మార్కస్ స్టొయినిస్ (13), నికోలస్ పూరన్ (9) ఇలా బ్యాటర్లు అందరూ విఫలం కావడంతో లక్నో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఒక దశలో 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే అమిత్ మిశ్రా ( 19), నవీన్ హుల్ హక్ (13) విజయం కోసం పోరాటం చేశారు. చివరకు లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బెంగళూరు జట్టులో హేజల్ వుడ్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. సిరాజ్, మాక్స్ వెల్, హసరంగ, హర్షల్ పటేల్ కు ఒక్కో వికెట్ దక్కింది.

లక్నో కెప్టెన్ రాహుల్ 11వ స్థానంలో బ్యాటింగ్ దిగి 3 బంతులను ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా నాటౌట్ నిలిచాడు. బెంగళూరు జట్టులో కృష్ణప్ప గౌతమ్ (23) అత్యధిక పరుగులు చేశాడు. ఇరు జట్ల నుంచి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ కొట్టలేదు. ఈ మ్యాచ్ మొత్తానికి టాప్ స్కోరర్ గా నిలిచిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×