BigTV English

IPL Tickets Scam: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. టికెట్లు ఇప్పిస్తామంటూ సైబర్ మోసాలు..

IPL Tickets Scam:  హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. టికెట్లు ఇప్పిస్తామంటూ సైబర్ మోసాలు..
IPL Tickets Scam SRH vs CSK
IPL Tickets Scam SRH vs CSK

IPL Tickets Scam SRH vs CSK: ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెలుస్తున్నాయి. ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్‌కి టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి.


ఆన్‌లైన్‌లో టికెట్స్ అన్నీ క్లోజ్‌ అవ్వడంతో పేటీఎం విక్రయాలు మొత్తం నిలిపివేసింది. అయితే, టికెట్స్ ఆన్లైన్‌లో అమ్ముతున్నామంటూ సైబర్‌ ముఠా మోసాలకు దిగుతోంది. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్స్‌పై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్‌ నేరగాళ్ల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ప్రజల్లో ఆశించిన మేర అవగాహన రావట్లేదు.

Also Read: ఇద్దరి మనసులు ఒకటాయే.. కొహ్లీ-గంభీర్ కలిసిన వేళ..


అటు బ్లాక్ టికెట్ల దందా కూడా జోరుగా నడుస్తోంది. రూ. 1500 టికెట్ దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య పలుకుతోంది. దీంతో పోలీసులు మ్యాచ్ ముందు ఎవరైనా బ్లాక్ టికెట్లు అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ బ్లాక్ టికెట్ దందాను అరికట్టాలని పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×