Big Stories

Virat Kohli – Gautam Gambhir: ఇద్దరి మనసులు ఒకటాయే.. కొహ్లీ-గంభీర్ కలిసిన వేళ..

Virat Kohli and Gautam Gambhir news

- Advertisement -

Virat Kohli and Gautam Gambhir Hug on Field(Sports news today): టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ అంటే ఒక ఫైర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ తనిప్పుడు చాలా మారిపోయాడు. ఆనాటి కొహ్లీ ఇప్పుడు లేడు. తన మాట, మనసు అంతా మారిపోయింది. ఇప్పుడా ఫైర్ అంతా ఆట వరకే పరిమితం చేసుకున్నాడు. ఇదంతా భార్య అనుష్క శర్మ వల్లనే అంటారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత విరాట్ లో పూర్తిగా వేదాంత ధోరణి వచ్చేసింది. ఎందుకీ పరుగులు, దేనికోసం తాపత్రయం అనే భావనలోకి వెళ్లిపోయాడు.

- Advertisement -

తనెంత మనసులో దాచుకున్నా, ఆ మాటలు ఏదో రూపంలో ఎప్పుడో ఒక దగ్గర బయట పడుతూనే ఉన్నాయి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే విరాట్ కొహ్లీ మారాడు అనేదానికి ఒక చక్కని ఉదాహరణ ఒకటి చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.

విరాట్ ఇంకా గౌతం గంభీర్ మధ్య కొంతకాలంగా వైరం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారిప్పుడు కలిసిపోయారు. నవ్వుతూ మాట్లాడుకున్నారు. హగ్ చేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో స్ట్రాటజిక్ టైమ్ వచ్చింది.  కోల్ కతా టీమ్ కి మెంటర్ గా ఉన్న  గౌతమ్ గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చాడు. అప్పటికి విరాట్ ఆఫ్ సెంచరీ చేసి మంచి ఊపు మీదున్నాడు. టీమ్ మేట్స్ ని కలుసుకున్న గంభీర్ సరాసరి కొహ్లీ దగ్గరకు వచ్చి అభినందించాడు. దాంతో కొహ్లీ కూడా నవ్వుతూ పలకరించాడు.

Also Read: లక్నో బోణీ కొడతారా? పంజాబ్ కింగ్స్ తో నేడు మ్యాచ్

హఠాత్తుగా గంభీర్ తనంతట తనే వెళ్లి విరాట్ ని పలకరించడంతో నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. విరాట్ కూడా మనసులో దిగులంతా పోయినట్టు ముఖంలో ఫ్రెష్ నెస్ తో హాయిగా నవ్వుతూ కనిపించాడు. దీంతో నెటిజన్లు క్రికెట్ అంటేనే జెంటిల్మేన్ గేమ్ అని, మీరిద్దరూ చాలామందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడుతున్నారు.

అయితే ఇన్నాళ్లూ కొహ్లీ ఎంతో మానసిక వేదన అనుభవించాడు.అందుకే గంభీర్ తను పదిమెట్లు దిగి విరాట్ కి స్నేహ హస్తం అందించాడని చెబుతున్నారు. ఇది కదరా స్నేహం అంటే అని అంటున్నారు. అలా వీరిద్దరి మధ్యా 11 ఏళ్ల వైరానికి తెరపడింది.

2013లో కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ లో వీరిద్దరూ గొడవ పడ్డారు. 2015లో మళ్లీ వీరిద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాదు ఆ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది ఈ సందర్భంగా విరాట్ పెద్ద పెద్ద కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇదంతా చూసి తట్టుకోలేని గంభీర్ డగౌట్ లో కుర్చీని ఒక్క తన్ను తన్నాడు. తర్వాత ఫైన్ కట్టాడు. తాజాగా 2023లో మరోసారి కొహ్లీ గొడవపడుతుంటే అందులోకి గంభీర్ జోక్యం చేసుకునేసరికి మంట వేడెక్కిపోయింది.అదిప్పటికి చల్లారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News