Campher – 5 wickets: క్రికెట్.. ఈ పదం వింటే చాలు క్రీడాభిమానులు ఎగిరి గంతేస్తారు. టెస్ట్, వన్డే, ఐపీఎల్, వరల్డ్ కప్.. ఏ మ్యాచ్ అయినా సరే టీవీలకు అతుక్కుపోతుంటారు. వీలైతే క్రికెట్ స్టేడియాలలో ప్రత్యక్షంగా మ్యాచ్ లు వీక్షించేందుకు హాజరవుతారు. వారి అభిమాన క్రికెటర్లు కసితీరా ఆడుతుంటే కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ని ఇష్టపడే దేశాలు చాలానే ఉన్నాయి.
Also Read: Watch Video: లేడీ గెటప్ లో విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ ను ఫుట్ బాల్ లాగా తన్నేశాడుగా
అయితే ఈ క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతుంటాయన్న విషయం మనకు తెలిసిందే. క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. మ్యాచ్ లో ఒక్కోసారి ఓటమి అంచుల వరకు వెళ్లిన జట్టు అనూహ్యంగా గెలుపు చేజిక్కించుకుంటుంది. ఇక అప్పటివరకు గెలిచినట్టే కనిపించిన జట్టు.. అనూహ్య ఓటమితో తేరుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది.
5 బంతుల్లో 5 వికెట్లు:
ఇలా క్రికెట్ లో మనం సాధారణంగా ఇప్పటివరకు మూడు బంతులకు మూడు వికెట్లు పడగొట్టడం చూసాం. అలాగే ఆరు బంతులకు ఆరు సిక్స్ లు కొట్టడం కూడా ఇటీవల సాధారణంగా మారింది. కానీ ఐదు బంతులకు ఐదు వికెట్లు తీయడం ఎప్పుడైనా చూశారా..? ఇది క్రికెట్ లో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అయితే తాజాగా ఐర్లాండ్ ఆల్రౌండర్ కర్టిస్ కాంఫర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.
ఐదు బంతులలో ఐదు వికెట్లు సాధించిన మొదటి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన ఇంటర్ ప్రావిన్స్ టి-20 ట్రోఫీ మ్యాచ్ లో కర్టిస్ కాంఫర్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఐర్లాండ్ పేస్ బౌలర్ తన సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలవడం ఇది రెండవసారి. గతంలో లసిత్ మలింగ తర్వాత టి-20 ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఈ ఆల్ రౌండర్.. ఈసారి 5 బంతుల్లో ఐదుగురిని పెవిలియన్ కి చేర్చాడు.
గురువారం ఇంటర్ ప్రొవిన్షియల్ టి-20 ట్రోఫీలో మాన్ స్టర్ రెడ్స్ కు ఆడుతూ.. 12వ ఓవర్ లో చివరి రెండు బంతులకు విల్సన్, హ్యూమ్ లను అవుట్ చేశాడు. ఆ తర్వాత 14వ ఓవర్ లో తొలి 3 బంతుల్లో మెక్ బ్రిన్, మిల్లర్, జోష్ లను పెవిలియన్ చేర్చాడు. దీంతో మొత్తంగా 2.3 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ప్రొఫెషనల్ క్రికెట్ లో పురుషుల్లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా కాంఫర్ రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో 189 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నార్త్ వెస్ట్ వారియర్స్ బ్యాటర్లు 88 పరుగులకే కుప్పకూలారు. దీంతో మాన్ స్టర్ రెడ్స్ 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
Curtis Campher 5 balls 5 Wickets. https://t.co/ypmGvx3Ia0 pic.twitter.com/zHIn6iNz4w
— H U S Nain (@H11USNAIN) July 10, 2025