Watch Video: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. టి-20 వరల్డ్ కప్ 2024 సమయంలో టీ-20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన కింగ్ కోహ్లీ.. ఆ తర్వాత నుంచి వన్డేలు, టెస్ట్ లు ఆడుతూ వచ్చాడు. ఇక ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్ కి కూడా దూరమయ్యాడు. ఇకపై 50 ఓవర్ల ఫార్మాట్ లో మాత్రమే విరాట్ కోహ్లీ ఆటను ఆస్వాదించాల్సిన పరిస్థితి.
దాయాదిపై మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో.. పాకిస్తాన్ 241 పరుగులు చేయగా.. టీమిండియా 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 11 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. చివరివరకు నాటౌట్ గా నిలిచాడు. చాలాకాలం పాటు ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో అద్భుత ఫామ్ లోకి వచ్చి వన్డేల్లో మరో సెంచరీ సాధించాడు.
దీంతో ఈ మ్యాచ్ లో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అలాగే ఐసీసీ ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ 5 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకోవడం గమనార్హం. అలాగే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్.. ఇలా మూడు వేర్వేరు వన్డే సిరీస్ లలో పాకిస్తాన్ పై సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇంతవరకు మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు.
పుష్ప గెటప్ లో కోహ్లీ:
పాకిస్తాన్ పై సెంచరీ సాధించిన సమయంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అదేంటంటే.. నిజానికి మనదేశంలో రెండే రెండు ఎంతో ఫేమస్. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిలో ఒకటి క్రికెట్ అయితే.. మరొకటి సినిమా. ఈ రెండు లేకుండా మన దేశ ప్రజలు ఉండలేరని చెప్పొచ్చు. అంతేకాదు ఈ రెండింటికి మంచి అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయి. సినీ యాక్టర్లు, క్రికెటర్లు కలిసి పలు యాడ్స్ లో కలిసి నటించిన వీడియోలను మనం చూస్తూనే ఉంటాం. ఇలా వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు.
Also Read: Viral Video: కుక్కతో క్రికెట్ మ్యాచ్… సామాన్లు మొత్తం జారిపోయాయి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన అనంతరం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని లేడీ గెటప్ ని విరాట్ కోహ్లీ వేసినట్లుగా ఓ వీడియోని క్రియేట్ చేశారు. ఈ వీడియోలో జాతర సన్నివేశంలో లేడి గెటప్ లో ఉంటాడు విరాట్ కోహ్లీ. ఆ సమయంలో జరిగే ఫైట్ సన్నివేశంలో విరాట్ కోహ్లీ ఫేస్ ని.. అల్లు అర్జున్ తలపై క్రియేట్ చేసి.. అతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని తన్నినట్లుగా వీడియోని క్రియేట్ చేశారు. ఆ సమయంలో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే అదే వీడియోని తాజాగా మరోసారి వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని ఫుట్ బాల్ తన్నినట్టు తన్నేసాడని కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link