BigTV English

Irfan Pathan: BCCI అవమానించింది.. కానీ పఠాన్ రివేంజ్ తీర్చుకున్నాడు !

Irfan Pathan: BCCI అవమానించింది.. కానీ పఠాన్ రివేంజ్ తీర్చుకున్నాడు !

Irfan Pathan: భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ఫాస్ట్-మీడియం స్వింగ్, సీమ్ బౌలర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. 19ఏళ్ల వయస్సులో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. తన ఆశాజనక ప్రదర్శనలు, అద్భుతమైన స్వింగ్ తో పాకిస్తాన్ కు చెందిన వసీం అక్రమ్ తో పోల్చబడ్డాడు. మొదటి ఓవర్‌లో టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా పఠాన్ నిలిచాడు. 2006 ప్రారంభం తర్వాత, పఠాన్ క్రమంగా వేగం, స్వింగ్‌ను కోల్పోవడం ప్రారంభించాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కామెంట్రీ చేయకుండా ఇర్ఫాన్ పఠాన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆంక్షలు విధించింది. దీంతో ఆయన కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని క్రికెట్ గురించే తన సొంత ఛానెల్ లో కామెంట్రీ చేస్తున్నాడు పఠాన్. ఈనేపథ్యంలో ఇర్ఫాన్ పఠాకు మంచి ఆదరణ లభిస్తోంది. సబ్ స్క్రైబర్లు కూడా విపరీతంగా పెరుగుతున్నారు. BCCI వద్దన్నప్పటికీ కూడా సొంతంగా సక్సెస్ సాధించాడు ఇర్ఫాన్ పఠాన్.

వాస్తవానికి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను ఈ ఏడాది ఐపీఎల్ లో కామెంటరీ నుంచి బీసీసీఐ మినహాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కొద్ది రోజుల క్రితమే సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ ఛానల్ కి 2.46 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు యాడ్ అయ్యారు. ఇందులో తన అభిప్రాయాలను ఆయన పంచుకుంటున్నారు. బెస్ట్ పర్ఫార్మర్లపై ప్రశంసలు, కొందరి పై విమర్శలు చేస్తున్నారు.


ఇర్ఫాన్ పఠాన్ 2008 నుంచి 2010 వరకు పంజాబ్స్ కింగ్స్ కి, 2011 నుంచి 2013 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కి, 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2016లో రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్,2017లో గుజరాత్ లయన్స్ కి ఆడారు. టీమిండియాలో తన ఆల్ రౌండ్ ప్రదర్శనను చూపించారు. కొద్ది రోజులు భారత ఓపెనర్ గా కూడా కొనసాగారు. 2004లో ఓపెనర్ గా ఆస్ట్రైలియా పై సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

టీ-20 ప్రపంచ కప్ లో ఆరంగేట్రం చేసిన తొలి భారత బౌలర్ గా పఠాన్ గా నిలిచాడు. దీంతో అతను వన్డే జట్టులోకి కూడా వచ్చాడు అప్పట్లో. అతని బౌలింగ్  తగినంత ప్రభావంతంగా లేకపోవడంతో జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. పఠాన్ ఏప్రిల్ 2008లో దక్షిణాఫ్రికా పై భారత్ తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మరోవైపు పఠాన్ 2015లో కల్చర్ టీవీలో ప్రసారమైన ప్రముఖ నృత్య కార్యక్రమం ఝలక్ దిఖ్లా జాలో 8వ సీజన్ లో పఠాన్ పోటీ దారుగా పాల్గొన్నాడు. పఠాన్స్ క్రికెట్ అకాడమిని ఇర్ఫాన్ పఠాన్, యూసూఫ్ పఠాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ అకాడమీ భారత మాజీ కోచ్ కపిల్ దేవ్, కామెరాన్ బ్రెడెల్ లతో ప్రధాన మార్గదర్శకులుగా ఒప్పందం కుదుర్చుకుంది. చాపెల్ అకాడమీ కోచ్ లకు శిక్షణ ఇస్తాడు. క్రికెట్ లో పఠాన్ పలు రికార్డులను నమోదు చేశాడు. 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×