BigTV English

Hyderabad : రూ.200లకే బట్టతలపై జుట్టు.. హైదరాబాద్‌లో క్యూ కట్టిన యువత..

Hyderabad : రూ.200లకే బట్టతలపై జుట్టు.. హైదరాబాద్‌లో క్యూ కట్టిన యువత..

Hyderabad : “రండి బాబు రండి.. ఆలస్యం చేసినా ఆశాభంగం. కేవలం 200 రూపాయలే. గుండు గీస్తా.. గుండు మీద క్రీమ్ రాస్తా.. బట్టతలపై జుట్టు మొలిపిస్తా.. మీకు అసలు డౌటే అక్కరలేదు.. ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ నా కస్టమరే.. నేను క్రీమ్ రాస్తేనే అతనికి జుట్టు వచ్చింది..” అంటూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వకీల్ తెగ ఊదరగొడుతున్నాడు. బట్టతలపై జుట్టు రప్పిస్తానంటూ సవాల్ చేసి మరీ చెబుతున్నాడు. ఇంకేం. ఆశావహులు భారీగా తరలివస్తున్నారు. బట్టతల ప్రాబ్లమ్ మామూలిదా మరి. ప్రతీరోజు పదుల సంఖ్యలో ఆ సెలూన్ ముందు క్యూ కడుతున్నారు. పాతబస్తీలోని బిగ్‌బాస్ సెలూన్ ఇప్పుడో ట్రెండింగ్. ఆ షాపు ముందు బట్టతల బాధితుల జాతర నడుస్తోంది.


బట్టతల.. ఆ బాధే వేరబ్బా..

బట్టతల.. ఇప్పుడు ఇదో అతిపెద్ద సమస్య. కోట్లాది రూపాయల ఆస్థిపాస్తులు ఉన్నా.. బట్టతలపై జుట్టు లేకుంటే కలిగే అసంతృప్తి అంతాఇంతా కాదు. జట్టు.. సొసైటీలో స్టేటస్ సింబల్. బట్టతలతో బయట తిరిగేందుకు నామోషీగా ఫీల్ అవుతుంటారు. వాళ్లకు పెళ్లి కావడం చాలా చాలా కష్టం. డబ్బులున్న వాళ్లు కాస్త ఎక్కువైనా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటారు. మరి మధ్యతరగతి పరిస్థితి..? అంత డబ్బు ఖర్చు చేయలేక బట్టతలతో సిగ్గు పడుతుంటారు. క్యాప్‌లతో కవర్ చేస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ దేవుడిలా కనిపించాడు వకీల్ సాబ్.


గింజల క్రీమ్.. బిగ్‌బాస్ కస్టమర్

ఢిల్లీకి చెందిన వకీల్.. కొంతకాలం కిందట హైదరాబాద్ వచ్చి ఓల్డ్ సిటీలో సెటిల్ అయ్యాడు. సెలూన్ పెట్టుకుని బతుకుతున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ అతనో కిరాక్ ఐడియాతో ముందుకొచ్చాడు. తన దగ్గర బట్టతలపై జుట్టు రప్పించే క్రీమ్ ఉందని చెప్పాడు. జమాల్ గోట గింజలతో తాను ఆ క్రీమ్ తయారు చేశానని అంటున్నాడు. నున్నగా గుండు గీసి.. ఆ క్రీమ్ తలకు పట్టిస్తే.. 8 రోజుల్లో వెంట్రుకలు మొలుస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు. కావాలంటే మీరూ ట్రై చేయండి.. మీ పొలంలోనూ మొలకలు వస్తాయని.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు కూడా బట్టతలపై జట్టు తెప్పించానని వీడియోలు పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. అదే నిజమని నమ్మిన జనాలు.. హైదరాబాద్ పాతబస్తీలోని బిగ్‌బాస్ సెలూన్ ముందు బారులుతీరారు.

ఫ్రీ..ఫ్రీ.. అంటూ ఫుల్ పబ్లిసిటీ

అలాగని.. మనోడు భారీగా డబ్బులు ఏమీ దండుకోవడం లేదు. గుండు గీసేందుకు మాత్రమే కేవలం 200 తీసుకుంటున్నాడు. క్రీమ్ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. తానే స్వయంగా నున్నగా గొరికి.. దట్టంగా క్రీమ్ రాసి పంపిస్తున్నాడు. ఆ క్రీమ్ రాసుకున్న వాళ్లకు జుట్టు వచ్చిందనే ప్రచారం జోరందుకోవడంతో.. ఆ సెలూన్‌కు ఫుల్ గిరాకీ. దాదాపు ప్రతీరోజూ ఆ షాప్ ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటున్నాయి. అంతా బట్టతలతో వచ్చినవారే…

Also Read : అలేఖ్య చిట్టి పికిల్స్.. మెగా ఫ్యామిలీకి ప్రాబ్లమ్?

వీళ్ల వీక్‌నెస్.. వాళ్ల బిజినెస్

మొదటిసారి వచ్చిన వాళ్లు నమ్మేశారు. క్రీమ్ రాయించుకుని ఎంచక్కా ఇంటికెళ్లిపోయారు. ఇక తమ బట్టతల పాయే అంటూ మురిసిపోయారు. వకీల్ చెప్పినట్టు 8 రోజులు ఓపిగ్గా ఎదురుచూశారు. 9వ రోజు గుండు తడుముకుంటే వెంట్రుకలు తలగట్లేదు. బట్టతలపై జుట్టు కనిపించలేదు. మరో కొన్నిరోజులు అలాగే ఓపిగ్గా చూశారు. అయినా, మొలకలు రాకపాయే. పైగా మంట, దురద లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీగా వచ్చాయి. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్నారు. అంతా ఫేక్ అని తిట్టుకున్నారు. ఒకసారి వచ్చిన వాళ్లు మరోసారి తిరిగి రాకపోయినా.. కొత్త వాళ్లు మాత్రం ఇంకా నమ్మకంతో వస్తుండటంతో.. ఆ బిగ్ బాస్ సెలూన్ ముందు గంటల తరబడి క్యూలు మాత్రం తగ్గట్లేదు. రూ.200లే తీసుకుంటున్నాడు కాబట్టి సరిపోతోంది. లేదంటేనా ఇప్పటికే ఆ వకీల్ చేసిన పనికి చితక్కొట్టేవారు బాధితులంతా. బట్టతల.. జుట్టు.. అనేసరికి ఎవరైనా ఆశ పడటం ఖాయం. వాళ్ల వీక్‌నెస్సే అతని సెలూన్ ప్రమోషన్‌గా మారింది. కానీ, ఇలా బట్టతల బాధితుల మనోభావాలతో ఆడుకోవడం మాత్రం కరెక్ట్ కాదబ్బా. వకీల్ సాబ్.. జర సోచో.

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×