E-Paper
Advertisement

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బూట్లు నాక‌డంలో షాహిద్ అఫ్రిది బిజీగా ఉన్నాడు

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బూట్లు నాక‌డంలో షాహిద్ అఫ్రిది బిజీగా ఉన్నాడు
Advertisement

Irfan Pathan Slams Shahid Afridi :  పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ జైలులో నరకాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ త‌రుణంలోనే పాకిస్తాన్ జట్టుకు ఎన్నో సేవలు అందించిన ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆ దేశ‌ ప్రభుత్వాన్ని విదేశీ క్రికెటర్లు కోరుతుంటే.. షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) లాంటి క్రికెటర్లు ఏం పీకుతున్నారని ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ ఖాన్ హెల్త్ గురించి, ప్రభుత్వంపై పోరాటం చేయకుండా… పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ (Asim Munir) బూట్లు నాకడంలో బిజీ అయిపోయాడని షాహిద్ అఫ్రిదిపై ఫైర్ అయ్యారు. ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సేవలు అందించడమే కాకుండా… ప్రధానిగా గొప్ప స్థాయికి ఎదిగిన ఇమ్రాన్ ఖాన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఆ దేశ క్రికెటర్లకు ఉందని వెల్లడించారు. అయితే దీనిపైన ఇప్పటి వరకు పాకిస్తాన్ క్రికెటర్లు స్పందించకుండా.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ త‌రుణంలోనే ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బూట్లు నాక‌డంలో షాహిద్ అఫ్రిది బిజీగా ఉన్నాడు

Advertisement

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో నరకం అనుభవిస్తున్న నేపథ్యంలో ఇండియాకు సంబంధించిన మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తో పాటు మొత్తం 21 మంది అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు స్పందించారు. వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కు బహిరంగ లేఖ రాశారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు అతని కుటుంబ సభ్యులకు ప్రతిరోజు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. మానవతా దృక్పథంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం మెలగాలని రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా జైలులో ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యం చేస్తే అతడికి కన్ను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

షాహిద్ ఆఫ్రిది పై ఇర్ఫాన్ బఠాన్ ఫైర్

Advertisement

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఇండియాకు సంబంధించిన క్రికెటర్లు స్పందిస్తున్నారని గుర్తు చేశారు ఇర్ఫాన్ పఠాన్. కానీ, షాహిద్ అఫ్రిది ఇలాంటి వాళ్లు అతని గురించి పట్టించుకోకుండా… పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ (Asim Munir) బూట్లు నాకుతూ బిజీగా జీవితాన్ని గడుపుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా పాకిస్తాన్ మాజీ లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు అందరూ మొద్దు నిద్ర లేవాలని డిమాండ్ చేశారు. అందరూ ఏకతాటి పైకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం లో కదలిక వచ్చేలా ప్రయత్నాలు చేయాలని ఇర్ఫాన్ పఠాన్ కోరారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×