Irfan Pathan on Rohith Sharma: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని నెలలుగా టెస్టులలో ఘోరంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ లోనే కాదు కెప్టెన్ గా కూడా విఫలమవుతున్నాడు రోహిత్ శర్మ. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేసిన రోహిత్.. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరింత దారుణంగా ఆడుతున్నాడు.
Also Read: Gautam Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కోచ్ ?
తన బ్యాట్ తో కనీసం 20, 30 పరుగులు కూడా రాబట్టడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ కి బూమ్రా నేతృత్వం వహించాడు. ఈ టెస్ట్ లో భారత జట్టు విజయం సాధించగా.. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు టెస్టులలోనూ భారత జట్టు ఓటమిపాలైంది. మరొక టెస్ట్ డ్రా గా ముగిసింది. ఈ సిరీస్ లో తొలి టెస్ట్ మినహా రోహిత్ శర్మ ఆడిన మూడు టెస్టులలో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.
ఐదు ఇన్నింగ్స్ లలో అతని బ్యాటింగ్ చూస్తే.. 3, 6, 10, 3, 9.. ఇలా ఘోరంగా విఫలమవుతున్నాడు. అంతేకాదు గత 15 ఇన్నింగ్స్ లలో అతడి సగటు 10.93 ఉందంటే అతని ఫామ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో రోహిత్ శర్మ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ భారత జట్టుకు భారంగా మారాడని, ఇక అతను టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తేనే మంచిదనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత ఇర్ఫాన్ పఠాన్ కూడా రోహిత్ శర్మ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ భారత జట్టు కెప్టెన్ కాకపోయి ఉంటే.. అతడిని ఎప్పుడో తుది జట్టులో నుంచి తప్పించేవారని అన్నాడు. అతడి వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుందని వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ లేకపోతేనే భారత తుది జట్టుకు ఖచ్చితమైన రూపు వస్తుందని స్పష్టం చేశాడు.
” రోహిత్ శర్మ :Irfan Pathan on Rohith Sharma} జట్టులో లేకపోతే.. రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా.. గిల్ వన్ డౌన్ లో వచ్చేవారు. రోహిత్ కెప్టెన్ కాబట్టే ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు. అతడు కెప్టెన్ కాకపోయి ఉంటే తుది జట్టుకు ఎంపిక చేస్తారని అనుకోవడం లేదు. రోహిత్ శర్మ బ్యాటింగ్ లో రాణించలేకపోతున్నాడు” అని పేర్కొన్నాడు ఇర్ఫాన్ పఠాన్.
Also Read: Mohammed Siraj – Babar Azam: బెయిల్స్ టెక్నిక్.. సిరాజ్‌ను Copy కొట్టిన పాక్ ?
ఇక ఇర్ఫాన్ పఠాన్ విషయానికి వస్తే 2004లో భారత్ తరపున తన క్రికెట్ కెరీర్ ని ప్రారంభించాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో, స్వింగ్ తో బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు. 2004లో ఐసీసీ నుంచి “ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్” టైటిల్ ని కూడా అందుకున్నాడు ఇర్ఫాన్. అంతేకాదు భారత్ తరపున తొలి ఓవర్ లోనే హైట్రిక్ సాధించిన ఏకైక బౌలర్ గా నిలిచాడు. భారత జట్టు తరఫున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్, 120 వన్డేలు, 24 టి-20 మ్యాచ్ లు ఆడాడు.