BigTV English

Mohammed Siraj – Babar Azam: బెయిల్స్ టెక్నిక్.. సిరాజ్‌ను Copy కొట్టిన పాక్ ?

Mohammed Siraj – Babar Azam: బెయిల్స్ టెక్నిక్.. సిరాజ్‌ను Copy కొట్టిన పాక్ ?

Mohammed Siraj – Babar Azam:  భారత్-ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య కూడా బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా సెంచూరియన్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రెండవ రోజు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam ), భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను అనుకరిస్తూ కనిపించాడు. వాస్తవానికి బాబర్ ఆజం ( Babar Azam )… మహమ్మద్ సిరాజ్ (  Mohammed Siraj) ను కాపీ కొట్టి స్టంప్ బెల్స్ ను మార్చాడు. అంతకుముందు గబ్బా లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) స్టంప్ బెల్స్ ను మార్చిన విషయం తెలిసిందే.


Also Read: Indian Team – WTC Final: బాక్సింగ్‌ టెస్ట్‌ లో ఓటమి.. WTC Final ఛాన్స్‌ ఇంకా టీమిండియాకు ఉందా ?

అప్పుడు మూడవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) చేసిన పని హాట్ టాపిక్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్కస్ లబుషేన్ ఏకాగ్రతను చెదరగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే మహమ్మద్ సిరాజ్ వికెట్లపై ఉన్న బెల్స్ ను మార్చాడు. అయితే నెక్స్ట్ ఓవర్ లోనే లబుషేన్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న మెల్బోర్న్ టెస్ట్ లోను సిరాజ్ అదే పని చేశాడు. ఇన్నింగ్స్ 43వ ఓవర్ సమయంలో మహమ్మద్ సిరాజ్ స్ట్రైకర్స్ ఎండ్ కు వెళ్లి బెల్స్ మార్చాడు.


 

దీని తర్వాత ఉస్మాన్ భారత పెసర్ బూమ్రా దెబ్బకు అవుట్ అయ్యాడు. దీని తర్వాత అజామ్ కూడా మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj) ట్రిక్ ను ఫాలో అయ్యాడు. సెంచూరియన్ వేదికగా రెండవ రోజు బాబర్ అజామ్ స్టంప్ బెల్స్ ను మార్చడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫీల్డింగ్ జట్టు ఆటగాళ్లు బ్యాట్స్మెన్ల దృష్టిని మరల్చడానికి ఇలా చేస్తారు. ఇలాంటి ఘటనలు ఇదివరకు చాలానే జరిగాయి. గతంలో కోహ్లీ అదే పని చేసి వార్తల్లో నిలిచాడు. కాగా బాబార్ అజామ్ మరోసారి బ్యాటింగ్ లో విఫలమయ్యాడు.

Also Read: Captain’s Field Setup: కమిన్స్ ఓవరాక్షన్…10 మంది ప్లేయర్లతో అటాక్ ?

తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ( South africa) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకొని తోలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 211 పరుగులకే పరిమితం అయింది. కమ్రాన్ గులాం ( Kamran Ghulam ) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ తో 54 పరుగులు చేశాడు కమ్రాన్ గులాం ( Kamran Ghulam ) . ఇది కాకుండా ఆ జట్టులో మరి ఏ ఇతర బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. రెండవ ఇన్నింగ్స్ లోనైనా పాకిస్తాన్ బాటర్లు పెద్దగా రాణించలేదు. దింతో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ పై 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×