E-Paper
Advertisement

Jacob Bethell: 150 కోట్ల భార‌తీయుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు..తండ్రి ముందు మాత్రం జాకబ్ బెతెల్ క‌న్నీళ్లు

Jacob Bethell: 150 కోట్ల భార‌తీయుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు..తండ్రి ముందు మాత్రం జాకబ్ బెతెల్ క‌న్నీళ్లు
Advertisement

Jacob Bethell:  టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో నిన్న టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్, ఓడిపోవాల్సి వచ్చింది. ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా ( Wankhede Stadium, Mumbai) టీమిండియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్, ఏడు పరుగుల తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ సెంచరీ తో ఇండియాకు చుక్కలు చూపించాడు. ఒకానొక సమయంలో ఇండియాను ఓడిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతన్ని రనౌట్ చేసిన నేపథ్యంలో టీమిండియా విజయం సాధించింది. లేకపోయి ఉంటే ఇండియా ఇంటిదారి పట్టేది.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

150 కోట్ల భారతీయులకు చుక్కలు చూపించిన జాకబ్ బెతెల్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గురువారం టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట టీమిండియా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 20 ఓవర్లు టీమిండియా ఆడింది. ఈ సందర్భంగా ఏడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 253 పరుగులు సాధించింది. ఈ రేంజ్ లో టీమిండియా స్కోర్ చేయడంతో, మనోళ్లు సులభంగా గెలుస్తారని అందరూ అనుకున్నారు.

కానీ అప్పుడే వచ్చాడు జాకబ్ బెతెల్. ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 48 బంతుల్లోనే 105 పరుగులు చేసి ఇరగదీశాడు జాకబ్ బెతెల్. ఇందులో 7 సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. 218 స్ట్రైక్ రేటుతో టీమిండియా బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. ఈ దెబ్బకు ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్ వెళ్తుందని అందరూ అనుకున్నారు. 150 కోట్ల మందికి ముచ్చెమటలు పట్టించాడు. కానీ 105 పరుగుల వద్ద అతడు రన్ అవుట్ అయిన నేపథ్యంలో టీమిండియా చేతిలోకి మ్యాచ్ వచ్చింది. ఆ తర్వాత బాగా ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఇక టీమిండియా ఫైనల్స్ లోకి దూసుకు వెళ్లి.. ఎల్లుండి న్యూజిలాండ్ తో మ్యాచ్‌ ఆడనుంది.

తండ్రికి ఎమోషనల్ హగ్ ఇచ్చిన జాకబ్ బెతెల్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీ ఫైనల్ లో ఇండియా పై సెంచరీ నమోదు చేసిన జాకబ్ బెతెల్… తన తండ్రికి హగ్ ఇచ్చి ఎమోషనల్ అయ్యాడు. 150 కోట్ల భారతీయులకు చుక్కలు చూపించిన జాకబ్ బెతెల్ ( Jacob Bethell)… మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్రేక్షకుల వద్ద ఉన్న తన తండ్రిని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. నువ్వు బాధపడకు.. సాధ్యమైనంతవరకు నువ్వు ప్రయత్నించావు… ఇది చాలు అంటూ జాకబ్ బెతెల్ కు ఆయన తండ్రి ధైర్యం చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కొడుకు సక్సెస్ ను చూసిన తండ్రికి ఇంకేం కావాలి అంటున్నారు.

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

jacob bethell emotional reaction with his father after stunning performance against india england 2nd Semi-Final match T20 World Cup 2026 check details

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×