Champions Trophy 2025: ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం రోజు కటక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు ఓటమిపాలైంది. ఇలా అసలే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకి మరో షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
Also Read: Virat Kohli: షేక్ హ్యాండ్ ఇచ్చిన కోహ్లీ.. గుండెలపై చేయి వేసుకుని కుర్రాడు రచ్చ !
ఫిబ్రవరి 19 నుండి.. అంటే మరో 9 రోజులలో ఈ టోర్ని ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ {Champions Trophy 2025} కి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించారు. అంతేకాదు అతడి గాయం తనని ఎంతగానో నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొన్నాడు. ఈ గాయం కారణంగానే టీమ్ ఇండియాతో జరిగిన రెండవ వన్డేలోనూ అతడు ఆడలేదని పేర్కొన్నాడు.
జాకబ్ బెథెల్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక ఇంగ్లాండ్ తరపున 2024 సెప్టెంబర్ లో అరంగేట్రం చేసిన జాకబ్ బెథెల్.. అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేస్తూ తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నాడు. టాప్ ఆర్డర్ నుండి.. మిడిల్ ఆర్డర్ వరకు ఏ స్థానంలోనైనా అతడి బ్యాటింగ్ సరిపోతుంది. ముఖ్యంగా ఇన్నింగ్స్ ని చివరిదాకా నిలబెట్టే అతని నైపుణ్యం ఇంగ్లాండ్ కి చాలా అవసరం.
జాకబ్ ఒత్తిడి లోను ప్రశాంతంగా ఉండి, అవసరమైన సమయంలో జట్టుకు ముఖ్యమైన పరుగులు చేయగలడు. ఇక భారత్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో.. ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికీ జాకబ్ రాణించాడు. 64 బంతులలో 51 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. బౌలింగ్ లో కూడా 3 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
Also Read: SA20 2025: కావ్య పాప టార్చర్.. పెళ్లి క్యాన్సల్ చేసుకున్న సన్‌రైజర్స్ ప్లేయర్ ?
ఇలాంటి ఓ ఆటగాడు ఛాంపియన్స్ ట్రోఫీ {Champions Trophy 2025} కంటే ముందు జట్టుకు దూరం కావడం ఇంగ్లాండ్ కి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. ఇక జాకబ్ చాంపియన్ ట్రోఫీ 2025 కి దూరమయ్యాడనే విషయం తెలిసిన ఇంగ్లాండ్ క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇంగ్లాండ్ సెలక్టర్లు అతడి స్థానాన్ని ఏ ప్లేయర్ తో భర్తీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో ఇంగ్లాండ్ జట్టు ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్ – ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక మార్చి 1న ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా తో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ లలో గెలుపొందితే.. ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ కి చేరుకుంటుంది.