E-Paper
Advertisement

Tilak Varma Watch: తిల‌క్ వ‌ర్మకు షాక్‌..రూ.2.13 కోట్ల వాచ్ ముక్క‌లు చేసిన‌ చెన్నై బౌల‌ర్‌

Tilak Varma Watch: తిల‌క్ వ‌ర్మకు షాక్‌..రూ.2.13 కోట్ల వాచ్ ముక్క‌లు చేసిన‌ చెన్నై బౌల‌ర్‌

Tilak Varma Watch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League 2026 Tournament) ఫైనల్ దశకు వస్తే, ఐపీఎల్ మాత్రం సగం మ్యాచులు ఫినిష్ చేసుకుంది. మరో సగం మ్యాచులు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Chennai Super Kings vs Mumbai Indians, 44th Match,) మధ్య 44వ మ్యాచ్ నిన్న ఎంఏ చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదికగా నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

రెండు ముక్క‌లైన తిల‌క్ వ‌ర్మ వాచ్‌

ముంబై ఆటగాడు తిలక్ వర్మ ( Tilak Varma ) బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో అదిరిపోయే బంతి సంధించాడు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ జామీ ఓవర్టన్ ( Jamie Overton). అయితే అతడు విసిరిన బంతి తిలక్ వర్మ ( Tilak Varma Watch) చేతికి తగిలింది. ఈ క్రమంలో తిలక్ వర్మ పెట్టుకున్న ఖరీదైన వాచ్ ముక్కలైపోయింది. బంతి తగలగానే చేతి నుంచి కింద పడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు కూడా వస్తునేను.

తిలక్ వర్మ వాచ్ ధర ఎంత అంటే ?

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Chennai Super Kings vs Mumbai Indians, 44th Match,)  మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తిలక్ వర్మ వాచ్ ముక్కలైంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఓవర్టైన్ వేసిన బంతిని రివర్స్ స్కూప్ షార్ట్ కొట్టేందుకు తిలక్ వర్మ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అది మిస్సైంది. దీంతో తిలక్ వర్మ వాచ్ రెండు ముక్కలు అయింది. ఏప్రిల్ 23వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగగా, ఆ సమయంలో జామీ ఓవర్టన్ అలాగే తిలక్ వర్మ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వాచ్ వివాదం రాజుకుంది. ఇక ఈ వాచ్ ధర రెండు కోట్లకు పైగా ఉంటుందని చర్చ జరుగుతోంది. తిలక్ వర్మ ధరించిన వాచ్ ఆడిమర్స్ పిగెట్ రాయల్ ఓక్ పెర్పెచువల్ క్యాలెండర్ ఓపెన్‌వర్క్డ్ ధర రూ.2.13 కోట్లు ఉంటుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 159 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఫినిష్ చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో కూడా ఆరవ స్థానానికి చేరింది.

 

 

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×