BigTV English

January Cricket Schedule : జనవరిలో మ్యాచ్ లే మ్యాచ్ లు.. అన్ని జట్లు బిజీ బిజీ..

January Cricket Schedule : జనవరిలో మ్యాచ్ లే మ్యాచ్ లు.. అన్ని జట్లు బిజీ బిజీ..
January Cricket Schedule

January Cricket Schedule : జనవరి నెల ప్రారంభమై అప్పుడే పదిరోజులు గడిచిపోయింది. ఈరోజు నుంచి టీమ్ ఇండియా టీ 20 సిరీస్ ను ఆఫ్గనిస్తాన్ తో ఆడేస్తోంది. మూడు టీ 20లు వరుసపెట్టి జరగనున్నాయి. టీమ్ ఇండియా తరహాలోనే దాదాపు క్రికెట్ ఆడే ప్రముఖ దేశాల జట్లన్నీ కూడా జనవరిలో క్రికెట్ మ్యాచ్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నాయి.


ఇదే జనవరి నెల 25 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే  5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి టీమ్ ఇండియా సిద్ధం అవుతోంది. మరి జనవరి నెలలో ఏఏ దేశాలు క్రికెట్ ఆడుతున్నాయో ఒకసారి చూసేద్దాం పదండి. అన్నీ చూశాక, మీరు కూడా ఇన్ని మ్యాచ్ లా అనుకుంటారు. పదండి మరి…ఆ మ్యాచ్ లు, ఆ జట్ల వివరాలేమిటో చూసేద్దాం…

శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ శ్రీలంకలో జరగనుంది. జనవరి 14, 16, 18 మధ్య వరుసగా మ్యాచ్ లు కొలంబో  ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఇదే నెలలో జనవరి 6, 8 తేదీల్లో వన్డేలు జరిగాయి. ఒకటి వర్షార్పణం అయ్యింది. రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. మూడో వన్డే జనవరి 11న జరగనుంది.


జనవరి 17 నుంచి 29 వరకు ఆస్ట్రేలియా దేశంలో వెస్టిండీస్ పర్యటించనుంది. ఈ రెండు దేశాల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. జనవరి 12 నుంచి 21 వరకు పాకిస్తాన్ జట్టు 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ కోసం న్యూజిలాండ్ లో పర్యటించనుంది.

చూశారు కదండీ దాదాపు క్రికెట్ ఆడే ప్రముఖ దేశాలన్నీ కూడా జనవరి నెలలో బిజీబిజీగా ఉన్నాయి. ఒకవైపున టీ 20 ప్రపంచ కప్ నకు సన్నద్ధం అవుతున్నాయి. మరోవైపు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం కూడా టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్నాయి.  కొత్త సంవత్సరం జనవరి నెల ఎవరికెలా ఉండబోతుందో చూడాల్సిందే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×