BigTV English

Japan: జర్మనీకి షాకిచ్చిన జపాన్‌

Japan: జర్మనీకి షాకిచ్చిన జపాన్‌

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఏకంగా నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీని… జపాన్ బోల్తా కొట్టించింది. రెండుసార్లు విశ్వవిజేత అయిన అర్జెంటీనాను సౌదీ అరేబియా మట్టికరిపించడమే పెద్ద సంచలనం అనుకుంటే… జర్మనీని జపాన్‌ ఓడించడం అంతకంటే పెను సంచలనం అని ఫ్యాన్స్ అంటున్నారు.


గ్రూప్‌-ఇలో భాగంగా జరిగిన మ్యాచ్ చివర్లో… అనూహ్యంగా రెండు గోల్స్ వేసి జర్మనీకి షాకిచ్చింది… జపాన్. సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్లు అయిన రిత్సు డాన్, టకుమా అసానో… చివరి 15 నిమిషాల్లో వేసిన రెండు గోల్స్‌తో జపాన్‌ 2–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లి, జర్మనీపై ఊహించని విజయం సాధించింది. తరచూ జర్మన్‌ క్లబ్‌లలో ఆడే రిత్సు, అసానో… చివరికి జర్మనీనే కంగుతినిపించి, ఆ జట్టు ఓటమిలో కీలకపాత్ర పోషించారు.

టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన జర్మనీ… ఆట ఆరంభం నుంచే జపాన్ మీద ఎదురుదాడికి దిగింది. ఏకంగా 24 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా షాట్లు ఆడింది. 33వ నిమిషంలో ఇల్కే గుయెండగన్‌ గోల్‌ వేయడంతో… తొలి అర్థభాగం ముగిసేసరికి జర్మనీ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తీవ్రమైన ఒత్తిడితో రెండో అర్ధభాగాన్ని మొదలుపెట్టిన జపాన్‌ ఖాతాలో… సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లు రిత్సు, అసానో అనూహ్యంగా రెండు గోల్స్ వేశారు. దాంతో… జపాన్‌ 2–1 ఆధిక్యంతో గెలుపు బాటలో నిలిచింది. కానీ జర్మనీ ఏ మాత్రం పట్టు సడలించలేదు. నిర్ణీత సమయంలోని 90వ నిమిషం నుంచి ఇంజ్యూరీ టైమ్‌ అయిన మరో 9 నిమిషాలు కూడా… స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా చెమటోడ్చింది. ఫుల్క్‌ రగ్, రుడిగెర్, గోరెట్జా, సులే… అదేపనిగా జపాన్ గోల్‌పోస్ట్‌పై షాట్లు ఆడారు. అయితే జపాన్‌ డిఫెండర్లు, గోల్‌ కీపర్‌ సమన్వయంతో ఆడ్డుకోవడంతో జర్మనీ ప్రయత్నాలు ఫలించలేదు. జపాన్‌ గోల్‌ కీపర్‌ షుయిచి గొండా మరీ అడ్డుగోడలా నిలబడటంతో… జర్మనీకి ఓటమి తప్పలేదు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆసియా జట్టు చేతిలో జర్మనీ ఓడిపోవడం ఇది రెండోసారి. 2018 ప్రపంచకప్‌లోనూ దక్షిణ కొరియా చేతిలో జర్మనీ 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×