ICC Test Rankings: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రా తన అద్భుత ప్రదర్శనతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ {ICC Test Rankings} లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అతను గబ్బా వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. మూడవ టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగిసినప్పటికీ.. ఈ టెస్ట్ లో 94 పరుగులు మాత్రమే ఇచ్చి 9 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Manu Bhaker: మనూ భాకర్ వివాదం ఏంటి… మోడీ ప్రభుత్వంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు ?
దీంతో 14 అదనపు రేటింగ్ పాయింట్లు లభించాయి. ఈ వారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ {ICC Test Rankings} లో బూమ్రా 904 రేటింగ్ పాయింట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్ గా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బూమ్రా సమం చేశాడు. ఇక మేల్ బోర్న్ వేదికగా జరగనున్న నాలుగవ టెస్ట్ లో అశ్విన్ రికార్డును బూమ్రా అధిగమించే అవకాశం ఉంది. మూడవ టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. 2016 డిసెంబర్ లో ఈ ఘనత సాధించాడు.
ఇక {ICC Test Rankings} బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా నాలుగు స్థానాలు దిగజారి 10వ ర్యాంక్ కి పడిపోయాడు. ఇక దక్షిణాఫ్రికా ప్లేయర్ కగిసో రబడా రెండవ స్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్ మూడవ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పై అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావీస్ హెడ్ పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నాలుగోవ స్థానానికి చేరుకున్నాడు.
825 పాయింట్లతో హెడ్ నాలుగవ స్థానంలోకి వచ్చాడు. ఇక ఇదే సిరీస్ లో నిలకడగా రాణిస్తున్న భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ పది స్థానాలు ఎగబాకి 40 వ స్తానానికి చేరుకున్నాడు. నాలుగు స్థానాలు పడిపోయి గిల్ 652 పాయింట్లతో 20వ ర్యాంక్ లో నిలిచాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఐదు స్థానాలు డౌన్ అయ్యి 35వ స్థానానికి పడిపోయాడు.
Also Read: Pv Sindhu Love Story: మొన్ననే పెళ్లి.. తన సీక్రెట్ లవ్ బయటపెట్టిన పీవీ సింధు?
{ICC Test Rankings} బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు.. జో రూట్ 895 పాయింట్లతో మొదటి స్థానం, హ్యారి బ్రూక్ 876 పాయింట్లు రెండవ స్థానం, కేన్ విలియమ్ సన్ 867 పాయింట్లు మూడవ స్థానంలో నిలిచారు. 4వ స్థానంలో ట్రావిస్ హెడ్, టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 5వ స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండు స్థానాలు దిగజారి 11 వ ర్యాంక్ కి పరిమితమయ్యాడు. అలాగే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి 21 వ ర్యాంకులో నిలిచాడు.