Pv Sindhu Love Story: భారత స్టార్ బ్యాడ్మింటన్, తెలుగు తేజం పీవీ సింధు తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాది వ్యాపారవేత్త, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని వివాహమాడింది పీవీ సింధు. రాజస్థాన్ లోని ఉదయపూర్ సమీపంలోని ఓ హోటల్ లో ఈనెల 22వ తేదీన రాత్రి 11:20 గంటలకు సింధు మెడలో మూడు ముళ్ళు వేశారు వెంకట దత్త సాయి. వీరి వివాహ వేడుకకు పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Also Read: Manu Bhaker: మనూ భాకర్ వివాదం ఏంటి… మోడీ ప్రభుత్వంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు ?
డిసెంబర్ 20వ తేదీన జరిగిన సంగీత్ తో సింధు పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజు హాల్ది ఫంక్షన్, 22న పెళ్లి జరిగిపోయాయి. ఇక తాజాగా వీరి పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ రిసెప్షన్ వేడుకకి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, నటి రోజా, తమిళ స్టార్ హీరో అజిత్, సింగర్ మంగ్లీ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
అయితే మంగళవారం రోజు తమ పెళ్లి ఫోటోలను సింధు సోషల్ మీడియాలో పంచుకుంటూ లవ్ ఎమోజిని జత చేసింది. ఇక రిసెప్షన్ వేడుక అనంతరం తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీని బయటపెట్టింది పీవీ సింధు. తన భర్త వెంకట సాయి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ.. రెండేళ్ల క్రితమే ఆయనతో కలిసి చేసిన ఓ విమాన ప్రయాణంతోనే తమ లవ్ స్టోరీ ప్రారంభమైందని తెలిపింది. 2022 అక్టోబర్ నెలలో తాము ఇద్దరం కలిసి ఓ విమానంలో ప్రయాణించామని.. ఆ తర్వాత అంతా మారిపోయిందని తెలిపింది.
ఆ జర్నీ మా ఇద్దరిని ఎంతగానో దగ్గర చేసిందని చెప్పుకొచ్చింది. అదంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా అనిపించిందని పేర్కొంది. ఆ క్షణం నుంచే మా ప్రేమ ప్రయాణం మొదలైందని చెబుతూ మురిసిపోయింది పీవీ సింధు. ఇక అలాగే తన నిశ్చితార్థ వేడుక గురించి మాట్లాడుతూ.. మా జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని మేము గ్రాండ్ గా చేసుకోవాలనుకోలేదని.. అందుకే మేము నమ్మిన వ్యక్తుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపింది.
Also Read: IND-W vs WI-W: టీమిండియాలో మెరిసిన మరో అందాల తార.. ఆమె అందానికి కూడా !
ఆ క్షణం చాలా భావోద్వేగభరిత క్షణమని.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక సింధు కెరీర్ విషయానికి వస్తే.. 2016 రియో ఒలంపిక్స్ లో రజతం, 2020 టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పథకాలు సాధించింది. అలాగే ఒలంపిక్స్ లో రెండు పథకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. 2019లో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించి భారతదేశానికి మరో గొప్ప విజయాన్ని అందించింది. ఈ విజయంతో పీవీ సింధు భారతీయ క్రీడా చరిత్రలో నిలిచిపోయింది.