రైలు ప్రయాణంలో చాయ్, కాఫీ అంటూ చాలా మంది వస్తుంటారు. వారి దగ్గరి నుంచి చాలా మంది టీ, కాఫీలు కొని తాగుతారు. కానీ, విమానంలో ఎవరైనా టీ అమ్మడం చూశారా? విమానంలో టీ అమ్మడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజంగా ఈ ఘటన ఇండిగో ఫ్లైట్ లో జరిగింది. కావాలంటే మీరే ఈ వీడియో చూడండి..
Three strolling down the aisle of an @IndiGo6E airplane, casually serving tea in disposable cups and one guy for filming the act at 36000 ft pic.twitter.com/dEWWKYtoRk
— J (@fnkey) December 24, 2024
విమానాల్లో వింత ఘటనలు
గత కొంత కాలంగా విమానాల్లో ఆశ్చర్యక సంఘటనలు జరగుతున్నాయి. తాజాగా సూరత్-బ్యాంకాక్ ఫ్లైట్ లో ప్రయాణీకులు ఏకంగా 15 లీటర్ల మద్యం తాగగా, తాజాగా మరో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. అచ్చం రైల్లో మాదిరిగానే విమానంలో ఓ ప్రయాణీకులు తన దగ్గర ఉన్న ఫ్లాస్క్ లో నుంచి వేడి వేడి టీ కప్పులలో పోసి ప్రయాణీకులకు అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి చేతిలో కప్పులు పట్టుకొని ఉండగా, మరో వ్యక్తి ఫ్లాస్క్ లోని చాయ్ పోస్తూ ప్యాసెంజర్లకు ఇస్తున్నాడు. తొలుత ఓ రాజస్థానీ వస్త్రధారణలో ఉన్న మహిళకు చాయ్ ఇచ్చిన వ్యక్తి, ఆ తర్వాత ఇతర ప్రయాణీకులకు కూడా అందించాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ తంతంగాన్ని అంతా ఓ ప్రయాణీకుడు వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలో నాలుగు లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో సటైర్లు వేస్తున్నారు. “ఇంతకాలం రైళ్లలోనే చాయ్ అమ్ముతారు అనుకున్నా. ఇప్పుడు విమానాల్లోనూ అమ్ముతున్నారు. మొత్తానికి విమానాన్ని రైలు బండి చేసేశారు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇకపై విమనాల్లోనూ ఇలాంటివే చూడాల్సి వస్తుంది” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఓ వ్యక్తి ఫ్లాస్క్ లో టీ తెచ్చి అందరికీ పోస్తుంటే క్యాబిన్ క్రూ, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే, ఈ ఘటన రాజస్థాన్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో జరిగినట్లు తెలుస్తోంది.
4 గంటల్లో 15 లీటర్ల మద్యం ఖాళీ
ఇక తాజాగా సూరత్- బ్యాంకాక్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులు మద్యం అంతా ఖాళీ చేసిన ఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది. కేవలం 4 గంటల వ్యవధిలో విమానంలోని మద్యం అంతా ఖాళీ చేసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ మద్యం విలువ సుమారు 1.8 లక్షలు ఉంటుందని విమానయాన వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చరిత్రలో ప్రయాణీకులు ఎప్పుడూ ఈ స్థాయిలో మద్యం తాగలేదని సంస్థ వెల్లడించింది. అంతేకాదు,బ్యాంకాక్ చేరుకోక ముందే విమానంలో మద్యం అయిపోయిందని సిబ్బంది అనౌన్స్ చేయడం విశేషం.
Read Also:ఈ కేఫ్ లో 15 నిమిషాలకు ఓసారి వర్షం, కాఫీ తాగాలంటే రెయిన్ కోట్ వేసుకోవాల్సిందే!