Jasprit Bumrah: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటులో… టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. టీమిండియా ప్లేయర్ లందరూ విఫలమవుతున్నప్పటికీ… ఈ ఫేస్ రేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) మాత్రం…. కంగారులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో… ఐదు నుంచి ఏడు వికెట్ల వరకు తీసి… ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటులో అదరగొట్టాడు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah). ఈ తరుణంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) అరుదైన రికార్డు… నమోదు చేయడం జరిగింది.
Also Read: Ind vs Aus Test series: ఐదవ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా భారీ ప్లాన్… కొత్త జెర్సీతో రంగంలోకి !
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన… తొలి భారత బౌలర్ గా జస్‌ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఏకంగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన జస్‌ప్రీత్ బుమ్రా… తొలి భారత బౌలర్ గా కూడా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు అంత మేర రేటింగ్ పాయింట్లు ఏ బౌలర్ కూడా… సాధించలేదు. 2016 సంవత్సరంలో టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) 904 పాయింట్లు.. నమోదు చేయడం జరిగింది.
అయితే ఆ రికార్డు ను మెల్ బోర్న్ టెస్టులోనే జస్‌ప్రీత్ బుమ్రా అధిగమించాడు. దీంతో… తన ఖాతాలో 907 వెయిటింగ్ పాయింట్లను సాధించగలిగాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. ఇక టెస్టుల్లో… బౌలర్ల లిస్టులో జస్‌ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో ఉండగా… ఆ తర్వాత హేజిల్ వుడ్ రెండవ స్థానం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మూడో స్థానంలో ఉన్నాడు. అనంతరం రబడ, జాన్సెన్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇది ఇలా ఉండగా…. 2018 సంవత్సరంలో విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి రికార్డు నమోదు చేశాడు. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ భాగంలో 2018 సంవత్సరంలో 937 పాయింట్లు సాధించాడు విరాట్ కోహ్లీ. ఆ సమయంలో విరాట్ కోహ్లీ భయంకరమైన ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2018లో 937 పాయింట్స్… సాధించి రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. అయితే రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin )… 904 పాయింట్లు ఇప్పటికే సాధించి ఉన్నాడు. 2016 సంవత్సరంలో రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) ఈ రికార్డు సాధించగలిగాడు. కానీ తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ( Jasprit Bumrah) . అంతేకాదు.. 2014 సంవత్సరం ఐసీసీ టెస్ట్ ప్లేయర్స్ అవార్డులో కూడా… టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా పేరు తెరపైకి వచ్చింది. కానీ t20 లిస్టులో మాత్రం బుమ్రాకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే.
Also Read: David Warner – PSL: ఐపీఎల్ లో అవమానం…డేవిడ్ వార్నర్ షాకింగ్ నిర్ణయం ?
Virat Kohli 🤝 Jasprit Bumrah
Two legends of Indian cricket ruling the ICC rankings! 🔥🐐
True greatness on display! 🇮🇳🏏#Cricket #ViratKohli #JaspritBumrah #India pic.twitter.com/SaRCFyaKMS
— Sportskeeda (@Sportskeeda) January 1, 2025