Ind vs Aus Test series: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా ప్రస్తుతం… ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది టీం ఇండియా. ఈ సిరీస్ లో ఇప్పటికే నాలుగు టెస్టులు పూర్తయ్యాయి. మరొక టెస్ట్ మాత్రమే ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. డబ్ల్యూటీసీ సైకిల్ లో ఇదే చివరి టెస్టు కూడా టీమిండియా కు కానుంది. ఇందులో కచ్చితంగా టీమిండియా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో చివరి టెస్టు మ్యాచ్లో గెలవాలని టీమ్ ఇండియా రంగం సిద్ధం చేస్తోంది.
అయితే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదవ టెస్ట్ ఈనెల మూడో తేదీ అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ కు పింక్ టెస్ట్ గా నామకరణం చేశారు. అంటే ఈ మ్యాచ్ కు సిడ్నీ స్టేడియం మొత్తం పింక్ కలర్ లో దర్శనం ఇవ్వబోతుంది అన్నమాట. అంతేకాదు ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ…. వైట్ డ్రెస్ తో పాటు ఉన్న జెర్సీ మాత్రమే ధరిస్తారు. పింక్ టెస్ట్ పూర్తయ్యే వరకు…. ఈ రూల్ కొనసాగుతుంది. అయితే పింక్ జెర్సీ దర్శించడానికి… ప్రత్యేక కారణం కూడా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కల్పిస్తూ…. మెక్ గ్రాత్ ఫౌండేషన్… పనిచేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ మెక్ గ్రాత్ ఫౌండేషన్కు మద్దతుగా 2009 సంవత్సరం నుంచి పింక్ టెస్ట్ నిర్వహిస్తోంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్. 2008 సంవత్సరంలో… మెక్ గ్రాత్ భార్య క్యాన్సర్ తో మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో మెక్ గ్రాత్ ఫౌండేషన్ నిర్మించారు మెక్ గ్రాత్. ఇక ఈ ఫౌండేషన్ కోసం డబ్బులు సేకరించి మరి చాలామందికి వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పింక్ టెస్ట్… నిర్వహిస్తోంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్. ఈ మ్యాచ్ లో పింకు డ్రెస్సులు అందుకే ఆస్ట్రేలియా ప్లేయర్లు ధరిస్తారు. దీంతో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.
Also Read: David Warner – PSL: ఐపీఎల్ లో అవమానం…డేవిడ్ వార్నర్ షాకింగ్ నిర్ణయం ?
కాగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య… జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ కూడా ఉదయం ఐదు గంటల సమయంలోనే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం రెండు గంటల లోపు పూర్తి అవుతుంది. ఈ మ్యాచ్ ను హాట్ స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఒకవేళ ఓడిపోతే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ బరి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ సిడ్నీ మ్యాచ్లో గెలిచినప్పటికీ…. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే… పోరు పైన ఆధారపడి ఉంటుంది. శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా ఆ రెండు మ్యాచ్లు ఓడిపోతే టీమిండియా కు ప్లస్ అవుతుంది. ఒకవేళ శ్రీలంక పైన ఆస్ట్రేలియా గెలిస్తే… టీమిండియా ఇంటికి పోవాల్సిందే. మరి… సిడ్నీ వేదికగా జరిగే ఐదవ టెస్టు మ్యాచ్లో…. టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి. అయితే చివరి మ్యాచ్ కు రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నట్లు… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లు దూరం అవుతే… టీమిండియా యంగ్ స్టార్ లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.