
Bumrah: టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా తండ్రయ్యాడు. అతడి వైఫ్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా వెల్లడించాడు. బుమ్రా దంపతులు చిన్నారి చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు.
తన చిన్న కుటుంబం పెరిగిందని బుమ్రా తెలిపాడు. తమ హృదయాలు సంతోషంతో నిండిపోయాయని పేర్కొన్నాడు. సోమవారం ఉదయం చిన్నారి అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించామని ఇన్ స్టా పోస్టులో తెలిపాడు. ఇప్పుడు తమ ఆనందానికి అవధుల్లేవన్నాడు. తల్లిదండ్రులుగా తమ జీవితాల్లో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయాన్ని ఆస్వాదిస్తామని బుమ్రా రాసుకొచ్చాడు.
బుమ్రా దంపతులకు క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. సూర్య కుమార్ యాదవ్, దినేశ్ కార్తిక్, రోహిత్ శర్మ భార్య రితికా,యువరాజ్ వైఫ్ హజెల్ కీచ్ బుమ్రా జంటకు శుభాకాంక్షలు చెప్పారు. సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నాడు.