E-Paper
Advertisement

India Vs England 4th Test: రాంచీ మ్యాచ్‌లో ఎవరుంటారు?

India Vs England 4th Test: రాంచీ మ్యాచ్‌లో ఎవరుంటారు?
Indian cricket news today

Who Will Be Playing in India in 4th Test(Indian cricket news today): ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో 2-1 తో టీమ్ ఇండియా ముందడుగు వేసింది. నాలుగో టెస్ట్ రేపటి నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఇప్పుడు జట్టులో ఎవరుంటారు? ఎవరు బెంచ్‌కే పరిమితం అవుతారనే సందేహాలు నెట్టింట జనాల్ని పట్టి పీడిస్తున్నాయి.

ఇంగ్లాండ్‌తో సిరీస్ మొదలైన దగ్గర నుంచి టీమ్ ఇండియా జట్టు కూర్పులో తీవ్రమైన ఇబ్బందులు పడుతోంది. విరాట్ కొహ్లీ దూరమైపోయాడు. తర్వాత గాయాల బెడద టీమ్ ఇండియాను పట్టి పీడిస్తోంది. మరోవైపు ఒకళ్ల పైనే భారం పడటంతో వారికి బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో బుమ్రాకి సెలవు ఇచ్చారు.

మూడో టెస్టు మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడుతున్న యశస్వి మరి నాలుగో టెస్టులో ఆడతాడా? లేదా? అనేది ఇంకా సందేహంగానే ఉంది. ప్రస్తుతం బుమ్రా ప్లేస్‌లో ఆకాశదీప్ ఆడతాడని అంటున్నారు. తనకి ఆరంగేట్రం మ్యాచ్ అవుతుందని అంటున్నారు. అయితే ముఖేష్ కుమార్‌కి అవకాశం వచ్చినా, తను రెండో టెస్టులో ఆకట్టుకోలేక పోయాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే అర్జంటుగా మళ్లీ సిరాజ్‌ను తీసుకొచ్చారు.

Read More: అందుకే విరాట్ చెప్పలేదా?

ఇప్పుడు తనే మెయిన్ స్ట్రీమ్ బౌలర్‌గా మారాడు. ఇప్పుడు తనకి సపోర్ట్ కావాలి. ఆకాశ్ దీప్ అయితే ఇండియా ఏ -ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 10 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 104 వికెట్లు పడగొట్టాడు. అందువల్ల తనవైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి.

మరోవైపున కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుకి కూడా దూరమవుతున్నాడు. దీంతో రెండు టెస్టుల్లో విఫలమైన రజత్ పటీదార్‌కి అవకాశం ఇస్తారా? లేదంటే దేవదత్ పడిక్కల్‌ని తీసుకొస్తారా? అనే సందేహాలు తీరలేదు.

ఈసారి నాలుగో టెస్ట్‌లో దేవదత్, ఆకాశ్ దీప్ ఇద్దరూ ఆరంగ్రేటం చేస్తే మొత్తం ఐదుగురి ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత టీమ్ ఇండియాకి దక్కుతుంది. ఇప్పటికే రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ అయ్యారు. ఇంక వీరిద్దరు మిగిలారని నెట్టింట కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి.

Tags

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×