Big Stories

Jasprit Bumrah : ముంబై ఇండియన్స్‌లో బుమ్రా యార్కర్.. హార్దిక్ రాకతో అలక… ఇన్‌స్టా పోస్టులతో కలకలం!

Jasprit Bumrah latest tweet

Jasprit Bumrah latest tweet(Indian cricket news today):

తాను ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలుస్తుందని అంటారు. అలాగే ముంబై ఇండియన్స్ ఒకటి తలచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చారు. కానీ జస్ప్రిత్ బుమ్రా రూపంలో మరొకటి ఎదురైంది. నిజానికి రోహిత్ శర్మ ఒకవేళ ఐపీఎల్ నుంచి తప్పుకుంటే, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలనేది ఆలోచనగా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ అక్కడే టీమ్ ఇండియా మెయిన్ స్ట్రీమ్ పేస్ బౌలర్ బుమ్రా కూడా అదే జట్టులో ఉన్నాడు. ఈ పరిణామాన్ని వాళ్లు ఊహించలేదు.

- Advertisement -

ఒకవేళ రోహిత్ శర్మ వెళ్లిపోతే, రూల్ ప్రకారం, సీనియర్ అయిన బుమ్రాకే కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అప్పటికే గుజరాత్ టైటాన్స్ కి ట్రోఫీ తేవడంతో పాటు, రెండో ఏడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఘనత హార్దిక్ పాండ్యాకి ఉంది. ఆ ట్రాక్ రికార్డ్ ముందు బూమ్రా తేలిపోతున్నాడని చెప్పాలి.

- Advertisement -

ఈ లెక్కలు ఎలా ఉన్నా బుమ్రా మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ముంబాయిని వీడనున్నట్టు ప్రచారమైతే జరుగుతోంది. ఇక్కడ హార్దిక్ పాండ్యాకి కెప్టెన్ ఇస్తున్నందుకు కాదు.. తనకి జట్టులో తగిన విలువ ఇవ్వనందుకు మనస్థాపంతో బుమ్రా ఉన్నాడని అంటున్నారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో పెడుతున్న కొన్ని పోస్టులు సంచలనంగా మారుతున్నాయి. అంతేకాదు ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో కావడం ఈ వార్తలకు బలాన్ని ఇస్తోంది.

ఇంతకీ బుమ్రా పెట్టిన పోస్టులు ఏమిటంటే.. కొన్నిసార్లు విశ్వాసంతో ఉండటం వల్ల మంచి జరగదు. అత్యాశతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాసేపటికి మరో పోస్ట్ పెట్టాడు.. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం.. అన్నింటికి సమాధానం చెబుతుంది.. అని రాశాడు. మళ్లీ ఏమనుకున్నాడో తెలీదు. వెంటనే వాటిని డిలీట్ చేసేశాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. చాలామంది దానిని స్క్రీన్ షాట్లు తీసి షేర్లు చేయడంతో ఆ పోస్టులు దావానంలా వ్యాపించాయి. దీంతో అందరూ కూడా కెప్టెన్సీ గురించే, తన బాధంతా అని చెబుతున్నారు. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే బూమ్రా ఇలా స్పందించంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు.

తను కూడా ఎంతైనా మనిషే కదా…తనకి భావోద్వేగాలుంటాయని కొందరు బుమ్రాకి మద్దతు తెలుపుతున్నారు. తను పోస్టులు తీసేసినా, అన్ ఫాల్ ని చేసింది మాత్రం అలాగే ఉంచేశాడు. దీనివల్ల అర్థమైంది ఏమిటంటే, తను ముంబై ఇండియన్స్ ని వదిలేసేలాగే కనిపిస్తున్నాడు. మరి రోహిత్ శర్మ, జట్టు మేనేజ్మెంట్ ఏమైనా బుజ్జగిస్తాయా? వదిలేస్తాయా? వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News