IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bangalore team ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడిందని బాధలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై మరో పిడుగు పడింది. ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యం లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ కు తీవ్ర గాయం అయింది. దీంతో రజత్ పాటిదార్ (Rajat patidar) ఈ టోర్నమెంట్ ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ కు తీవ్ర గాయం అయింది.
రజత్ పాటిదార్ చేతికి గాయం అయినట్లు సమాచారం అందుతుంది. అయితే ఆ గాయం తగ్గాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుందని ప్రాథమిక సమాచారం అందుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పున ప్రారంభమైన కూడా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ వస్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
Also Read: IPL 2025 – BCCI: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్.. ప్రతిరోజు రెండు మ్యాచ్ లు, 8 రోజుల్లోనే ఫినిష్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్ కావడంతో.. అతడు తర్వాతే మ్యాచ్లు ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… తన తర్వాతి మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది. ఆ మ్యాచ్ కోసం జితేష్ కుమార్ ను కెప్టెన్ గా నియామకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గట్టులో కొనసాగుతున్న జితేష్ కుమార్ కు మంచి అనుభవం ఉంది. ఈ టోర్నమెంట్ లో కూడా బాగానే రాణిస్తున్నాడు. అందుకే జితేష్ కుమార్ కు కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఒకవేళ రజత్ పాటిదర్ కోరుకుంటే జట్టులోకి వస్తాడు. లేకపోతే జితేష్ కుమార్ చివరి వరకు కొనసాగే ఛాన్సు ఉంది.
విరాట్ కోహ్లీకి ఇవ్వాలని డిమాండ్
రాయల్ చాలెంజెస్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ కు గాయం కావడంతో కెప్టెన్సీని విరాట్ కోహ్లీ కి ఇవ్వాలని చాలామంది అభిమానులు కోరుతున్నారు. విరాట్ కోహ్లీకి ఇస్తే బెంగళూరు జట్టు కచ్చితంగా కప్పు గెలుస్తుందని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గతంలో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాంపియన్ గా నిలవలేదు.
Also Read: Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !