BigTV English

Yuzvendra Chahal: సూసైడ్ చేసుకోవాలనుకున్న టీమిండియా క్రికెటర్… ఆ లేడీ టార్చర్ తట్టుకోలేక!

Yuzvendra Chahal: సూసైడ్ చేసుకోవాలనుకున్న టీమిండియా క్రికెటర్… ఆ లేడీ టార్చర్ తట్టుకోలేక!

Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య తన ఆటకంటే వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న చాహల్.. ప్రముఖ రేడియో జాకి ఆర్జే మహ్వాష్ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


Also Read: HCA: HCAలో భారీ కుదుపు.. జగన్ మోహన్ రావు సస్పెండ్

వీరిద్దరూ కలిసి డిన్నర్ కి వెళ్లడం, ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో వీరిద్దరూ కలిసి కనిపించడం, ఇక ఐపీఎల్ 2025 సమయంలో కూడా మహ్వాష్.. చాహల్ ఆడే పంజాబ్ కింగ్స్ జట్టుకు సపోర్ట్ ఇవ్వడానికి మైదానంలో కనిపించడం, తాజాగా వీరిద్దరూ కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టడం వంటి వాటితో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు వీరిద్దరూ ఎటువంటి అధికారికి ప్రకటన చేయలేదు.


విడాకులపై చాహల్ ఓపెన్:

మరోవైపు తన భార్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి చాహల్ కూడా ఈ విషయంపై ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడలేదు. 2020లో వివాహం చేసుకున్న చాహల్ – ధనశ్రీ వర్మ తమ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. అయితే ధనశ్రీ వర్మతో విడాకుల తరువాత తాను చాలా విమర్శలు ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు చాహల్. రాజ్ షమాని పాడ్ కాస్ట్ లో జరిగిన ఇంటర్వ్యూలో.. ధనశ్రీ గురించి చాలా పుకార్లు వచ్చినప్పటికీ తాను ఎప్పుడూ ఆమెను మోసం చేయలేదని స్పష్టం చేశాడు.

కానీ కొందరు తనను మోసగాడు అంటూ లేబుల్ వేశారని.. ఆ విమర్శల వల్ల కొన్నిసార్లు సూసై* ఆలోచనలు కూడా వచ్చాయని భావోద్వేగానికి గురయ్యాడు. తమకి విడాకులు ఖరారు అయ్యేవరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచామని తెలిపాడు చాహల్. ఈ ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. ” సంబంధం అనేది ఒక ఒప్పందం లాంటిది. ఒకరు కోపంగా ఉన్నప్పుడు.. మరొకరు వినాలి. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల స్వభావం సరిపోలలేదు. నేను భారత్ తరపున ఆడుతున్నాను. ఆమె కూడా తన పని తాను చేసుకుంటుంది.

ఇది రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. నేను ఇక్కడ, అక్కడ సమయం కేటాయిస్తున్నాను. కానీ సంబంధం గురించి ఆలోచించడానికి సమయం లేదు. ప్రతి ఒక్కరికి వారి సొంత జీవితం, లక్ష్యాలు ఉంటాయి. భాగస్వామిగా మీరు వారికి మద్దతు ఇవ్వాలి. నేను విడాకులు తీసుకున్నప్పుడు ప్రజలు నన్ను మోసగాడిగా చిత్రీకరించారు. కానీ నేనెప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. నేను చాలా నమ్మకమైన వ్యక్తిని. నాలాంటి వాడిని మీరు చూసి ఉండరు. నా అనుకున్న వారి గురించి చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ కొంతమందికి నా విషయంలో ఏం జరిగిందో కూడా తెలియదు.

కానీ నన్ను తప్పు పట్టడం చూశాను. మేమిద్దరం మా కెరీర్ లో సక్సెస్ కావాలనుకున్నాం. దీంతో రిలేషన్ షిప్ కి ప్రాధాన్యం ఇవ్వడం కష్టమైంది. మా ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధాలు తెగిపోయాయి. ఇక నేను విడాకులు తీసుకున్నక చాలా విమర్శలను ఎదుర్కొన్నాను. నేను నువ్వు మోసగాడిని అంటూ కామెంట్లు చేశారు. నాకు మహిళలను గౌరవించడం రాదని ఆరోపించారు. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. నా తల్లిదండ్రుల నుంచి మహిళలను గౌరవించడం నేర్చుకున్నాను. నేను ఎవరితోనైనా కనిపించినప్పుడు.. ప్రజలు అభిప్రాయాల కోసం దాని గురించి ఏదైనా రాయాల్సిన అవసరం లేదు.

Also Read: MS Dhoni: కొత్త లుక్ లో MS ధోని.. ఆయన స్టైల్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

నా పేరును ఇతరులతో లింక్ చేసి చాలా కథనాలు రాశారు. ఇవి చూసి నేను రోజులో కేవలం రెండు గంటలే నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా నాకు 45 రోజులపాటు నిద్ర కూడా లేదు. క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాను. ఏ విషయంపై ఏకాగ్రత పెట్టలేకపోయాను. నాకు ఆత్మహ** ఆలోచనలు కూడా వచ్చేవి. నా స్నేహితుడితో నా ఆలోచనలను షేర్ చేసుకున్నాను. నాకు చాలా భయమేసింది. నా స్నేహితులు ప్రాతిక్ పవార్, ఆర్జే మహ్వాష్ తో పాటు ఇతర స్నేహితులతో నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి చర్చించేవాడిని. ఇప్పుడు వారి వల్లే మళ్లీ మామూలు మనిషిగా తయారయ్యాను. ఇప్పుడు వారంతా నాతోనే ఉన్నారు” అంటూ తన మనసులోని బాధను బయటపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు యుజ్వేంద్ర చాహల్.

Related News

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Suryakumar Yadav : వాడి వ‌ల్లే ఒమ‌న్ పై బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాను..సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సూర్య కుమార్‌

Big Stories

×