Karun Nair: ఇంగ్లాండ్ తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ లోని తొలి రోజు ఆట ముగిసింది. ఈ ఐదవ టెస్ట్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వరుస వికెట్లను కోల్పోయి టీమిండియా తొలి రోజు నిరాశపరిచింది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లాండ్ పేసర్లు.. భారత బ్యాటింగ్ ని కట్టడి చేయడంలో విజయం సాధించారు.
Also Read: Yuzvendra Chahal: సూసైడ్ చేసుకోవాలనుకున్న టీమిండియా క్రికెటర్… ఆ లేడీ టార్చర్ తట్టుకోలేక!
తొలి రోజు మ్యాచ్ లో పలుమార్లు వర్షం అంతరాయం కదిగించింది. దీంతో తొలిరోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇక వరుస వికెట్లను కోల్పోయిన పరిస్థితిలో.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ నిలకడ ఆడుతూ హఫ్ సెంచరీ సాధించి జట్టును కాస్త నిలబెట్టాడు. ప్రస్తుతం అతడు 98 బంతుల్లో 52 పరుగులు చేసి ఇంకా క్రీజ్ లో కొనసాగుతున్నాడు. కరుణ్ నాయర్ తో పాటు వాషింగ్టన్ సుందర్ {19*} పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. దాదాపు దశాబ్దం క్రితం ఇంగ్లాండ్ పై చేసిన ట్రిపుల్ సెంచరీ తర్వాత.. టెస్టుల్లో కరుణ్ నాయర్ మొదటి 50 ప్లస్ స్కోర్ ఇదే కావడం గమనార్హం.
అయితే మొదటి మూడు టెస్ట్ లలో విఫలమైన కరుణ్ నాయర్.. నాలుగోవ టెస్ట్ కి దూరమైన విషయం తెలిసిందే. కానీ ఐదవ మ్యాచ్ లో మాత్రం శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చిన కరుణ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట సాయి సుదర్శన్ తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో భారత జట్టు 83/3 కష్టాల్లో ఉన్నప్పుడు నాయర్ క్రీజ్ లోకి వచ్చాడు. తన అనుభవాన్ని రంగరించి బ్యాటింగ్ చేస్తూ జట్టు స్కోర్ ని పెంచుతున్నాడు.
అతడు ఇన్నింగ్స్ లో ఏడు బౌండరీలు ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్ మొదలైనప్పటి నుండి ఇంగ్లాండ్ ప్లేయర్లు భారత ఆటగాలను స్లెడ్జింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు తలదించుకునేలా చేశాడు కరుణ్ నాయర్. ఐదవ టెస్ట్ తొలి రోజు అతడు వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. తొలిరోజు ఆటలో ఓవర్టెన్ వేసిన 57వ ఓవర్ చివరి బంతిని నాయర్ హాఫ్ సైడ్ వైపు డ్రైవ్ చేశాడు. ఆ బంతి బౌండరీ లైన్ వద్దకు వెళుతుండగా.. ఆ బంతిని క్రిస్ వోక్స్ ఆపాడు.
ఈ క్రమంలో అతడి భుజానికి బలమైన గాయమైంది. అతడు తీవ్ర నొప్పితో వెంటనే వైద్య సిబ్బందిని పిలిచాడు. అయితే అప్పటికే భారత బ్యాటర్లు మూడు పరుగులు పూర్తి చేశారు. ఆ సమయంలో నాలుగవ పరుగు తీసే అవకాశం ఉన్నప్పటికీ.. కరుణ్ నాయర్ వద్దని సుందర్ ని ఆపాడు. వోక్స్ గాయపడి ఇబ్బంది పడుతున్న క్రమంలో పరుగు తీసుకోవడం సరికాదనే ఉద్దేశంతో కరుణ్ ఇలా వ్యవహరించాడు.
Also Read: HCA: HCAలో భారీ కుదుపు.. జగన్ మోహన్ రావు సస్పెండ్
దీంతో క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అంటూ కరుణ్ నాయర్ పై ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇకనైనా కరుణ్ నాయక్ ని చూసి నేర్చుకోవాలని హితువు పలుకుతున్నారు. ఇక భుజం నొప్పితో క్రిస్ వోక్స్ ఫీల్డ్ ని వీడాడు. కాగా తొలి రోజు ఆట అనంతరం అతడి గాయం పై మరో బౌలర్ అట్కిన్సన్ స్పందించాడు. అతడి గాయం పై ఇంకా క్లారిటీ లేదని.. కానీ అతడు ఆట కొనసాగించడం కష్టమేనని వెల్లడించాడు. ఒకవేళ వోక్స్ బౌలింగ్ చేయలేకపోతే ఇది ఇంగ్లాండ్ కి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.