Chiru 158:ఏడుపదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దూకుడు పెంచడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ.. తన స్ట్రాటజీ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసారా’ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వశిష్ట మల్లిడి(Vassishta) దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara ) సినిమా చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ విడుదలకు నోచుకోలేదు. ఇక మరొకవైపు ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఇక ఇంతలోనే మరో ప్రాజెక్టు త్వరలో ప్రకటించనున్నారు చిరంజీవి.
చిరు 158 మూవీకి సర్వం సిద్ధం..
గత కొన్ని రోజులుగా డైరెక్టర్ బాబీ (Bobby) కి చిరంజీవి అవకాశం ఇవ్వనున్నారు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడది నిజం కాబోతోంది. మెగాస్టార్ 158 మూవీకి ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా చిరంజీవి చిత్రాలను ఎక్కువగా ఈ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది.. మరోవైపు ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఈ చిరు 158 మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించనుంది అని సమాచారం. మొత్తానికైతే అన్నయ్య స్పీడు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి కెరియర్..
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ విషయానికి వస్తే.. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చిరంజీవిగా పేరు మార్చుకొని.. ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు.. ఒకవైపు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. తన 39 ఏళ్ల నటన ప్రస్థానంలో మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతితో పాటు తొమ్మిది ఫిలింఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు.. అంతేకాదు 2006లో చలనచిత్ర రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. ఇక 2024 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయని సమాచారం.సినిమా నటుడి గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా వ్యవహరించారు.. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు టీవీ వ్యాఖ్యాతగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.
ALSO READ:Aamir Khan Apology: క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్ టీమ్.. అసలేం జరిగిందంటే?