RCB Fans Trolls CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. ఇవాళ రాయల్ చాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Royal Challengers vs Chennai Super Kings ) మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ నేపథ్యంలో… మహేంద్ర సింగ్ ధోనీని అవమానించేలా కోహ్లీ అభిమానులు… స్టేడియం బయట వ్యవహరిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని… అడ్డంగా దొరికిపోయిందని… టీ షర్టులను కూడా అమ్ముతున్నారు కోహ్లీ అభిమానులు.
Also Read: Nitish Kumar Reddy : కొడుకు SRH… తండ్రి RCB… ఫ్యాన్స్ ను పిచ్చోళ్ళు చేస్తున్నారు కదరా
చిన్న స్వామి స్టేడియం బయట టీ షర్ట్లు అమ్మకం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట… చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వ్యతిరేకంగా కోహ్లీ అభిమానులు వ్యవహరిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2016 అలాగే 2017 సంవత్సరంలో నిషేధానికి గురైందని… గుర్తుచేస్తూ టీషర్టులను రిలీజ్ చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ అసోసియేషన్. ఇందులో 2016 – 2017 అని రాసి ఉంది. ఈ టీ షర్ట్లు చెన్నైకి వ్యతిరేకంగా ముద్రించి… స్టేడియం బయట అమ్ముతున్నారు. కోహ్లీ అభిమానులు అందరూ ఈ టీషర్ట్లు వేసుకొని మ్యాచ్ చూడాలని.. బోర్డు కూడా పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
2016- 2017 రహస్యం ఇదే
2016- 2017 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మ్యాచ్ ఫిక్సింగ్ అలాగే బెట్టింగ్ కు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. కొంతమంది ప్లేయర్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించారు. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఉన్నారు. రెండు సంవత్సరాల పాటు రైసింగ్ పూణే జట్టుకు… మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరించాడు. రెండు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన తర్వాత మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ కోహ్లీ అభిమానులు ఇప్పుడు టీ షర్ట్ లను అమ్ముతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరువు పోయేలా వ్యవహరిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ బెంగళూరు మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రాల్చలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయబోతోంది.
Also Read: Vaibhav Suryavanshi : ఒరేయ్… రియాన్ పరాగ్ కొడుకే వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్
ilanti chillar gallu kabate inka trophy lekunda unnaru bathuki💦
Sport is a competitive game💯 online varaku ok offline lo kuda inta cheap tactics ante 💦 @RCBTweets #RCBvsCSK pic.twitter.com/eFAj53DRk3
— Prabhas Devotee🔥 (@sainathpb7) May 3, 2025