Inzamam-ul-Haq On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ టీ20 సిరీస్ పై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశాడు. భారత గడ్డపైనే రాణించే శ్రేయస్ అయ్యర్ సేన, న్యూజిలాండ్ పై వరుసగా మూడు మ్యాచ్ లు గెలవడం కాస్త అనుమానంగా ఉందంటూ ఇంజమామ్ ఉల్ హక్ బాంబ్ పేల్చాడు. టీమిండియా ప్లేయర్ల బ్యాట్లు కచ్చితంగా చెక్ చేయాల్సిందేనన్నారు. వాళ్ల బ్యాట్లల్లో స్ప్రింగులు, ఏఐ చిప్స్ ఉన్నాయనే అనునమానం తనకు ఉందంటూ ఆరోపణలు చేశాడు.
ఈ తరుణంలోనే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నట్టు ఫైర్ అయ్యాడు. ప్రతీ మ్యాచ్ లో అందరూ ఆడితే డౌట్ వస్తుందని, ఒకరు, ఇద్దరూ ఆడి.. మిగతా వాళ్లు కావాలనే త్వరగా ఔట్ అయిపోతున్నట్టు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగానే మొదట్లో నమన్ ధీర్, తిలక్ వర్మ మెరుపులు మెరిపించారన్నారు. ఇప్పుడు అభిషేక్ శర్మ సెంచరీతో రెచ్చిపోయినట్టు ఆరోపణలు చేశాడు. దీనిపై కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. దీనిపై ఐసీసీ బాస్ జై షాకు కూడా లేఖ రాస్తానంటూ హెచ్చరించారు. టీమిండియాను రోడ్డు ఈడ్చుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. టీమిండియా నిత్యం పాకిస్తాన్ ఏడవటం కామన్ అయిపోయిందని ఆగ్రహిస్తున్నారు.