Tanveer Ahmed On Abhishek Sharma – Vaibhav: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 3rd T20I) మధ్య జరిగిన మూడో టీ20 సందర్భంగా అభిషేక్ శర్మ (Abhishek Sharma) సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. నిన్న ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అర్థ సెంచరీ చేయలేదు కానీ బ్యాట్ ఝులిపించాడు. దీంతో టీమిండియా 13.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. అంతేకాదు 7.1 ఓవర్లలోనే 133 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ ఇద్దరు నెలకొల్పారు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరు బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరికీ న్యూజిలాండ్ బౌలర్లు స్లోగా బంతులు వేశారని తన్వీర్ అహ్మద్ ఆరోపించారు. అభిషేక్-వైభవ్ కంటే బాబర్-రిజ్వానే రియల్ హీరోలు అంటూ వ్యాఖ్యానించారు. వెల్లింగ్టన్ లో చిన్న బౌండరీలు ఉండడంతో అవలీలగా సిక్సర్లు బాదేసారని పరువు తీశారు. అంతేకానీ వీళ్ళు పీకిందేమీ లేదంటూ హేళన చేశారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశం కంటే బాబర్ ఆజం-మహమ్మద్ రిజ్వాన్ ఒకప్పటి ఓపెనర్ జంట చాలా బలమైందని వ్యాఖ్యానించారు. వాళ్లు కూడా మ్యాచ్ ను చివరి వరకు తీసుకువెళ్లి గెలిపించే వారని గుర్తు చేశారు. వాళ్ల తరహాలో అభిషేక్ శర్మ ఇటు వైభవ్ సూర్యవంశీ జన్మలో కూడా ఆడలేరని.. అసలు వీళ్లకు స్థిరత్వమే లేదంటూ హేళన చేశారు.
న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టి20 సందర్భంగా 13.2 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసింది టీమిండియా. అయినప్పటికీ టీమిండియాను ఉద్దేశించి తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా నిజంగా బలమైన జట్టె అయివుంటే… 199 పరుగుల లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో ఫినిష్ చేసే వాళ్లని హేళన చేశారు. కానీ అంత చిన్న లక్ష్యాన్ని 13.2 ఓవర్ల వరకు లాక్కుంటూ వచ్చారని సెటైర్లు పేల్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ సిక్స్ ల మీద సిక్సులు కొడతారు కదా..? న్యూజిలాండ్ గడ్డపై ఎందుకు కొట్టలేదని ప్రశ్నించారు. భారతదేశంలో ఉన్నట్టుగా.. పిచ్ లు విదేశాలలో ఉండవని చురకలు అంటించారు. కానీ వెల్డింగ్టన్ వేదికగా చిన్న బౌండరీలతో పాటు న్యూజిలాండ్ బౌలర్లు స్లో బంతులు వేయడంతో అవలీలగా టీమిండియా గెలవగలిగిందని తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.