Big Stories

Harbhajan Singh Counter: పాక్ మాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హర్భజన్ సింగ్!

Kamran Akmal Apologizes to Harbhajan for Making ‘Disrespectful’ Comments: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే రకరకాల భావోద్వేగాలు నడుస్తుంటాయి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఒక న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అర్షదీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేసి, టీమ్ ఇండియాను గెలిపించాడు. ఈ నేపథ్యంలో తను సిక్కు మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ మాటకు హర్భజన్ కు తిక్క రేగింది.

- Advertisement -

సిక్కులపై నోరుజారక ముందే చరిత్ర తెలుసుకోవాలని, వారు ముస్లింలకు చేసిన మేలు గుర్తుంచుకోవాలని మండిపడ్డాడు. ఆక్రమణదారులు అపహరించినప్పుడు మీ తల్లులు, సోదరీమణులను సిక్కులమైన మేమే
ఆనాడు రక్షించాం. ఈ మాటల పట్ల మీరు సిగ్గుపడాలి. మావారి పట్ల కాస్త కృతజ్ఞత కలిగి ఉండండి” అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

- Advertisement -

దీనికి వెంటనే కమ్రాన్ అక్మల్ స్పందించాడు. ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై ఎంతో బాధపడుతున్నాను. సిక్కులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నిజంగానే నేను తప్పుగా మాట్లాడాను. ఆరోజెందుకు మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు.  అందుకు నేనెంతో బాధపడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశంతో అనలేదు. నన్ను క్షమించండి” అని కమ్రాన్ అక్మల్ అన్నాడు. ముఖ్యంగా హర్భజన్ సింగ్ కి ప్రత్యేకంగా క్షమాపణలు తెలిపాడు.

Also Read: దక్షిణాఫ్రికా ‘మహరాజ్’.. బంగ్లాదేశ్ పై గెలిపించిన మనవాడు

ఇంతవరకు ఆట పరంగానే హద్దులు దాటేవారు. లేదంటే తమ దేశపు ఆటగాళ్లను విమర్శించుకునేవారు. లేదా టెక్నిక్ పరంగా ఇండియా జట్టుని విమర్శించేవారు. కానీ మతాలు, దేశాలు, సంప్రదాయాల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఆ గీతను కమ్రాన్ అక్మల్ దాటడంతో ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. అయితే బజ్జీ స్పందించి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి మంచి పని చేశాడని నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఈ నేపథ్యంలో వసీం అక్రమ్ ను చూసి అక్మల్ నేర్చుకోవాలని అంటున్నారు. ఇదే మ్యాచ్ అనంతరం తనేమన్నాడంటే పాకిస్తాన్ జట్టు మొత్తాన్ని మార్చి, కొత్తవాళ్లకి అవకాశాలు ఇవ్వాలని తెలిపాడు. ఈ జట్టుతో ఎక్కడికి వెళ్లినా పరువు పోవడం తప్ప మరొకటి లేదని కుండబద్దలు కొట్టినట్టు తెలిపాడు. వీలైతే ఇలా మాట్లాడండి..అంతేగానీ మతాలు జోలికి వెళ్లవద్దని నెటిజన్లు కడిగిపారేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News