Kapil Dev Insulted Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim).. ఈ పేరు చాలా పాపులర్. ఇతని గురించి తెలియని వారు ఉండరు. అండర్ వరల్డ్ డాన్ గా ఎదిగిన దావూద్ ఇబ్రహీం..భారత దేశంలో అనేక కుట్రలకు తెరలేపాడు. ఇంతటి డేంజర్ దావూద్ ఇబ్రహీం ను భారత డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మెడలు పట్టుకొని గెంటేసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. 1986 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఆ సమయంలో షార్జా వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ఓ వ్యాపారవేత్తగా నటిస్తూ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి (INDIA’S DRESSING ROOM) ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఓడించాలని టీమిండియా ప్లేయర్లను కోరాడు. బుజినెస్ మేన్ గెటప్ లో వెళ్లిన దావూద్ ఇబ్రహీం….టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ను (Kapil Dev) బాగానే బతిలాడాడు. పాకిస్తాన్ జట్టును ఓడిస్తే ప్రతి ఆటగాడికి సరికొత్త టయోటా కారు (Toyota car) ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
అలా మొత్తం 11 ప్లేయర్లకు 11 కార్లు పక్కగా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కానీ, ఈ ఆఫర్ విన్న కపిల్ దేవ్ మాత్రం సీరియస్ అయ్యాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంనున బయటకు గెంటేశాడు. ముందు మర్యాదగా చెప్పిన కపిల్ దేవ్, ఆ తర్వాత సెక్యూరిటీని రమ్మని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పంపించేశాడు. దీంతో టీమిండియా క్రికెటర్లు అందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు దావూద్ ఇబ్రహీం రావడంపై 2013లో ఇమిడియ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ కీలక ప్రకటన చేశాడు. 1986లో తమ డ్రెస్సింగ్ రూమ్ లోకి నిజంగానే దావూద్ ఇబ్రహీం వచ్చినట్టు అధికారికంగా ప్రకటించాడు. అప్పట్లో నటుడు మహమూద్… దావూద్ ఇబ్రహీంను ఒక వ్యాపారవేత్తగా డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకువచ్చారని ఆయన తెలిపాడు. అంతేకానీ కపిల్ దేవ్ తో పాటు తమకు దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్ అని తెలియదని క్లారిటీ ఇచ్చాడు. 1986 తర్వాత దావూద్ ఇబ్రహీం గురించి అందరికీ తెలిసిందని వ్యాఖ్యానించాడు. అతడు అంచెలంచెలుగా ఎదిగి ప్రమాదకరంగా మారాడని వివరించాడు.