Karnataka HC: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2025 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు ఎప్పుడైతే టైటిల్ గెలుచుకుందో అప్పటి నుంచి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. స్టేడియంలో విరాట్ కోహ్లీ కన్నీటి పర్వంతమయ్యారు. విరాట్ కోహ్లీని చూసిన అభిమానులు సైతం ఎమోషనల్ అయ్యారు. 18 సంవత్సరాల తరువాత ఆర్సీబీ టైటిల్ గెలుచుకుందని.. విరాట్ కోహ్లీ ఓపిక కి సలామ్ కొడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలోనే జూన్ 05న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా 11 మంది మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఇధిలా ఉంటే.. 11 మంది మృతికి కారణమైన తొక్కిసలాట పై కర్ణాటక హైకోర్టు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తొమ్మిది ప్రశ్నలను సంధించింది.
Also Read : RCB-JCB: JCBకి RCB టీమ్ కు సంబంధం ఏంటి… 18 ఏళ్ళ తర్వాత టైటిల్ కు కారణమా ?
కర్ణాటక హైకోర్టు సంధించిన కీలక ప్రశ్నల్లో జూన్ 10లోపు సమాధానాలు కోరింది. వాటిలో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని ఎవరు నిర్ణయించారు..? ఏ పద్దతిలో.. ఎప్పుడు..? ఈవెంట్ నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరబడిందా..? ఏదైనా క్రీడా ఈవెంట్ వేడుకల్లో 50వేల మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రేక్షకులను నిర్వహించడానికి ఏదైనా SOP( ప్రామాణిక ఆపరేటింగ్ విధానం) రూపొందించబడిందా..? బెంగళూరులోని క్రికెట్ స్టేడియం దుర్ఘటన పై న్యాయస్థానం సుమోటో గా స్వీకరించిన పిటిషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ వీ. కామేశ్వర్ రావు, జస్టీస్ సీఎం జోషీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ ప్రశ్నలను సంధించింది. వీటితో పాటు కొన్ని ఇతర ప్రశ్నలను కూడా వేసింది హైకోర్టు.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వానికి మధ్య సంభాషణలు, ఆర్‌సిబి హ్యాండిల్స్ మరియు బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా టైమ్‌లైన్‌లు, అలాగే పోలీసు ఎఫ్‌ఐఆర్‌లలో చేసిన ప్రకటనల నుండి విషాదానికి దారితీసిన సంఘటనల ప్రవాహం, జూన్ 3 న ఆర్‌సిబి క్రికెట్‌కు అభినందన కార్యక్రమం కోసం క్రికెట్ అసోసియేషన్ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్స్‌లో పంజాబ్ సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. KSCA CEO శుభేందు ఘోష్ జూన్ 3న విధాన సౌధలో RCB క్రీడాకారుల సన్మానానికి అనుమతి కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA నెట్‌వర్క్ తరపున ప్రభుత్వ సిబ్బంది మరియు పరిపాలనా విభాగం విధాన సౌధ సంరక్షకులు-కి లేఖ రాశారు. జూన్ 04వ తేదీ సాయంత్రం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం D.K.శివకుమార్ హాజరయ్యే విధాన సౌద పోర్టల్స్ ని రక్షించడానికి 16 పరుగులు విధించడం ద్వారా DPAR జూన్ 04న ఉదయం సమయంలో ఈ కార్యక్రమానికి అనుమతిని మంజూరు చేసింది.