BigTV English
Advertisement

Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ ఛాంపియన్ గా కర్ణాటక.. !

Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ ఛాంపియన్ గా కర్ణాటక.. !

Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ 2024 – 2025 టోర్నమెంట్ ( Vijay Hazare Trophy 2025) విజేతగా కర్ణాటక జట్టు ( Karnataka ) మరోసారి నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో 36 పరుగుల తేడాతో విజయం సాధించిన కర్ణాటక… విజయ్ హజారే ట్రోఫీ ( Vijay Hazare Trophy 2025)  ఎగురేసుకుపోయింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రాణించిన కర్ణాటక జట్టు… చివరి వరకు కష్టపడి గెలవాల్సి వచ్చింది. అటు ఈ మ్యాచ్ లో విదర్భ జట్టు ( Vidarbha ) కూడా పోరాటం బాగానే చేసింది. అయినప్పటికీ చివర్లో కర్ణాటక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 36 పరుగుల తేడాతో… విదర్భ ఓడిపోయింది.


Also Read: South Indian cricketers: చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన… దక్షిణాది క్రికెటర్లను తొక్కేసిన బీసీసీఐ ?

దీంతో ఫైనల్ మ్యాచ్లో గెలిచిన కర్ణాటక జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు ( Karnataka ) నిర్ణీత 50 ఓవర్లలో… 6 వికెట్లు నష్టపోయి 348 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విదర్భ జట్టు విఫలమైంది. చివరి వరకు పోరాడి.. విదర్భ ఓడిపోయింది. 48.2 ఓవర్లు వాడిన విదర్భ జట్టు 312 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కర్ణాటక 36 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది.


వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన 2024-25 ఎడిషన్ ఫైనల్‌లో 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించిన కర్ణాటక ( Karnataka ) … ఐదవ విజయ్ హజారే ట్రోఫీ టైటిల్‌ను ( Vijay Hazare Trophy 2025)  కైవసం చేసుకుంది. మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని కర్ణాటక ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒక ఓటమితో గ్రూప్ దశను ముగించింది. నాకౌట్‌లలో బరోడా, హర్యానాను ఓడించి విదర్భతో టైటిల్ పోరుకు సిద్ధం అయింది కర్ణాటక. ఇక ఫైనల్ లో కూడా గెలిచింది కర్ణాటక.

Also Read: India Squad for England Series: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కు టీమిండియా జట్టు ప్రకటన… బుమ్రా ఔట్?

విజయ్ హజారే ట్రోఫీ 2024 – 2025 ట్రోఫీ ని మయాంక్ అగర్వాల్ కు అందించారు. ఇక ఈ మ్యాచ్ లో అదరగొట్టిన… సిమ్రాన్ రవిచంద్రన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఫైనల్ మ్యాచ్లో సామ్రాన్ రవిచంద్రన్ 101 పరుగులు చేసి కర్ణాటకను ఆదుకున్నాడు. 92 బంతుల్లో 101 పరుగులు చేశాడు సామ్రాన్ రవిచంద్రన్. ఈ మ్యాచ్లో మూడు సిక్స్లు కొట్టిన సామ్రాన్ రవిచంద్రన్ 7 ఫోర్లు కొట్టాడు. అలాగే… కర్ణాటక బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్ 78 పరుగులు చేయగా అభినవ్ మనోహర్ 79 పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 348 పరుగుల భారీ స్కోర్ చేసింది కర్ణాటక. ఇక ఆటో ఈ మ్యాచ్లో కరుణ్ నయర్ ( Karun Nair )… కేవలం 27 పరుగులు చేసి ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. అయినప్పటికీ టోర్నమెంట్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నయర్ కు ( Karun Nair ) దక్కింది.

 

Related News

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Big Stories

×