South Indian cricketers: చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి మాసంలో ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ కోసం తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఆడబోతుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.
Also Read: India Squad for England Series: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన… బుమ్రా ఔట్?
అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో… సౌత్ క్రికెటర్లకు ఎవరికి అవకాశం రాలేదు. సౌత్ ఇండియా కు సంబంధించిన సంజు శాంసన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అతన్ని తీసుకోలేదు. కీపర్ గా రిషబ్ పంత్ అలాగే కేఎల్ రాహుల్ ను తీసుకున్నారు. అలాగే తెలుగు క్రికెటర్లు అయిన… తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజుకు అవకాశం దక్కలేదు.
మన రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు క్రికెటర్లు టీమిండియా కు ఆడుతున్నారు. మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు రెండు తెలుగు రాష్ట్రాల వారికి చెందినవారు. అయితే ఇందులో ముగ్గురికి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో ఆడే అవకాశం రాలేదు.
Also Read: India Squad for Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ప్రకటన.. గిల్ కు బంపర్ ఆఫర్
ముఖ్యంగా ముగ్గురు తెలుగు క్రికెటర్లు ఉన్నప్పటికీ… చివరికి మొన్న ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొన్న ఆస్ట్రేలియా గడ్డపై… కంగారులను కంగారెత్తించేశాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఓడిపోయే టీమిండియాను… ఒడ్డుకు చేర్చాడు. నితీష్ కుమార్ రెడ్డి… హార్దిక్ పాండ్యా తరహా లోనే మంచి ఆల్రౌండర్ అన్న సంగతి తెలిసిందే. ఫాస్ట్ బౌలింగ్ తో పాటు… సిక్స్ లు ఫోర్లు కొట్టగల దమ్మున్న తెలుగు ప్లేయర్. కానీ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా… వన్డే జట్టులోకి… చాలా రోజుల తర్వాత హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చారు.
ఇక మహమ్మద్ సిరాజ్ అంటే… కాస్త విఫలమవుతున్నప్పటికీ… తిలక్ వర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. యువరాజు సింగ్ తరహాలో బ్యాటింగ్ చేయగల సత్తా తిలక్ వర్మ లో ఉంది. కానీ అతన్ని కూడా కాదన్నారు. ఇక సంజు సాంసన్ విషయంలో బీసీసీఐ అన్యాయం చేసిందని చెప్పవచ్చు. కేఎల్ రాహుల్ , పంత్ కంటే అద్భుతంగా ఆడగల ప్లేయర్ సంజు. మహేంద్ర సింగ్ ధోనీ లాగా… టీమిండియాను గెలిపించే దమ్మున్న లీడర్. కానీ అతన్ని కూడా పక్కన పెట్టేసి… దక్షిణాది ప్లేయర్లకు అన్యాయం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీనిపై… దక్షిణాది రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.
BCCI didn’t consider sanju samson because he missed Vijay hajare trophy also bcci didn’t pick Karun nayar who averaging 700+ in vijay hajare trophy #ChampionsTrophy2025 pic.twitter.com/G8r4gClsv2
— Registanroyals (@registanroyals) January 18, 2025