US – Indian Nuclear Entities : బాధ్యతాయుతమైన అణు పరిశోధనలు నిర్వహించే భారత్ లోని కొన్ని అణు సంస్థలపై చాన్నాళ్లుగా అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ విషయాన్ని బైడెన్ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లగా.. భారతీయ అవసరాలకు, పరిశోధనలకు అడ్డంకిగా ఉన్న అణు సంస్థలపై నిషేధాన్ని ఆమెరికా ఉపసంహరించుకుంది. దేశంలోని అత్యుత్తమ పరిశోధనలు నిర్వహిస్తున్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్), ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్(ఐజీసీఏఆర్), ఇండియన్ రేర్ ఎర్త్(ఐఆర్మ్)లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఇరుదేశాల మధ్య పౌర- అణు రంగంలో సహకారానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని వ్యాఖ్యానించింది. భారత్, అమెరికా సంస్థల మధ్య పౌర-అణు రంగంలో నెలకొని ఉన్న బలమైన భాగస్వామ్యానికి అడ్డంకులుగా ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్లుగా.. ఆ దిశగా ఆమెరికా ప్రభావంతమైన చర్యలకు ఆలోచిస్తున్నట్లుగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవాన్ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అణు పరిశోధన, సహకారానికి ఎంతో కీలకమైన ఆంక్షల తొలగింపు ప్రకటన వెలువడింది. ఆమెరికా నిర్ణయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ హర్షం వ్యక్తం చేశారు. బైడెన్ సర్కారు తీసుకున్న కీలక చర్యల కారణంగారత్-అమెరికా మధ్య కీలకమైన పౌర అణు ఒప్పందం అమలు మరింత సమర్థవంతంగా, ప్రభావంతంగా అమలు చేసేందుకు వీలవుతుందని అన్నారు.
ఆంక్షలు ఎప్పుడు, ఎందుకు విధించారు.
అణు పరిశోధనలు, అణ్వాయుధాలు చాలా ప్రమాదకరమన్న విషయం ప్రపంచానికి రెండో ప్రపంచ యుద్ధం నాటికి తెలిసింది. దీంతో.. ఈ అణు కార్యక్రమాల్ని నిరోధించాలని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా నిర్ణయించింది. కేవలం శాంతి ప్రయోజనాలకు మాత్రమే అణు పరిశోధనలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చింది. కానీ.. చుట్టూ శత్రువులతో నిత్యం యుద్ధం వాతావరణంలో ఉండే భారత్.. తన అణు కార్యక్రమాల్ని సీక్రెట్ గా కొనసాగించింది. మిగతా ప్రపంచానికి తెలియకుండా.. అప్పటి ప్రధాని వాజపేయీ నేతృత్వంలో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి.. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అది..అమెరికా సహా మిగతా పాశ్చాత దేశాల ఊహలకు కూడా అందకుండా సాగడంతో.. అన్ని దేశాలు ఉలిక్కి పడ్డాయి. భారత్ సైతం అణు సాంకేతికతను అందిపుచ్చుకుందని కంగారు పడ్డాయి. అప్పుడే.. భారత అణు కార్యక్రమాల్ని నిలుపుదల చేసేందుకు, అంతర్జాతీయంగా ఇతర దేశాలు, సంస్థల నుంచి సాంకేతికతలు అందిపుచ్చుకోకుండా.. భారత అణు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధఇంచింది.
Also Read : కోల్‌కత్తా వైద్య విద్యార్థిపై హత్య కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. ఏం తేల్చిందంటే
అలాగే.. భారత్ అణు పరీక్షను నిర్వహించేందుకు ముందు ప్రపంచ అణు నిరాయుధీకరణ ఒప్పంద (NPT)లో సభ్యత్వం పై సంతకం చేయలేదు. ఓ వైపు అన్నీ దేశాల నిర్ణయానికి భిన్నంగా వెళ్లడం, అనుకోని తీరుగా తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో.. 1970ల చివర్లో, అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ప్రధానంగా అణు సాంకేతికత, సామగ్రి, సహకారం వంటి వాటిని నిరోధించాలని ప్రయత్నాలు చేసింది. అప్పటి నుంచి క్రమంగా ఒక్కో సంస్థపై ఆంక్షలు తొలిగిపోతుండగా.. ఇప్పుడు కీలకమైన మూడు సంస్థలపై ఆంక్షల్ని ఉపసంహరించుకుంది.