Karun Nair : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలిరోజు టీమిండియా 204/6 పరుగులు చేసింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (2), కే.ఎల్. రాహుల్ (14), సాయి సుదర్శన్ (38), కెప్టెన్ శుబ్ మన్ గిల్ (21), రవీంద్ర జడేజా (9) ధ్రువ్ జురెల్ (19) ఔట్ అయ్యారు. ప్రస్తుతం కరుణ్ నాయర్ 52, వాషింగ్టన్ సుందర్ 19 క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోతుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ అనవసరంగా రన్ ఔట్ కావడం.. టీమిండియా బ్యాటర్లు విఫలం చెందడంతో ఇంగ్లాండ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇన్ని రోజుల తరువాత కరుణ్ హాఫ్ సెంచరీ..
తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. తన చివరి హాఫ్ సెంచరీ డిసెంబర్ 19, 2016లో చేశాడు. దాని తరువాత డిసెంబర్ 31, 2025న ఇండియా తరుపున హాఫ్ సెంచరీ చేశాడు. అంటే దాదాపు 3167 రోజుల కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ సాధించాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నాడు. వాస్తవానికి దేనికైనా ఓపిక ఉండాలి. ఓపికతో ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు కరుణ్ నాయర్. వాస్తవానికి ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ కి ముందు భారత తుది జట్టులో ఓ ఆటగాడి పేరు చూసి అందరూ ఆశ్యర్యపోయారు. మూడు మ్యాచ్ ల్లో విఫలమైనా మళ్లీ అతనికి అవకాశం ఎందుకు ఇచ్చారు..? అని. స్క్వాడ్ లో అతడు తప్ప ఇంకా ఎవ్వరూ లేరా..? అస్సలు గంభీర్ కి కొంచెం అయినా తెలివి ఉందా.? అంటే మేనేజ్ మెంట్ పై ప్రశ్నల వర్షం కురిసింది. కానీ సదరు ఆటగాడు ఈ ప్రశ్నలన్నింటినీ తన ఆటతోనే సమాధానం చెప్పాడు కరుణ్ నాయర్.
కీలక సమయంలో కరుణ్ అద్భుత ఫామ్
కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి.. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత టీమిండియాలోకి పునరాగమనం చేసాడు. కానీ తన రీ ఎంట్రీలో ఈ కర్ణాటక ఆటగాడు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు ఆడిన నాయర్.. ఆశించిన రితీలో రాణించలేకపోయాడు. తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే నాలుగో టెస్ట్ కి మేనేజ్ మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసిందనే చర్చ నడిచింది. మరోవైపు కొందరూ కరుణ్ నాయర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే ప్రచారం కూడా చేశారు. కానీ టీమిండియా మేనేజ్ మెంట్ కరుణ్ నాయర్ కి చివరగా ఓ అవకాశం లభించింది. లండన్ లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో ప్రారంభమైన టెస్ట్ కు నాయర్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. శఆర్దూల్ ఠాకూర్ బదులుగా కరుణ్ నాయర్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ సారి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. రాహుల్, గిల్, జైస్వాల్ వంటి బ్యాటర్లు విఫలం చెందిన నాయర్ మాత్రం తన అద్భుత బ్యాటింగ్ తో సత్తా చాటాడు. రెండో కరుణ్ నాయర్ ఆట చాలా కీలకంగా మారనుంది.