Special Indian Railway Station: భారతీయ రైల్వే ప్రపంచంలోనే టాప్ 5లో ఒకటిగా కొనసాగుతోంది. లక్ష కిలో మీటర్లకు పైగా రైల్వే లైన్లు, 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు, 20 వేలకు పైగా రైళ్లను కలిగి ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ రైల్వే మార్గాలు ఉన్నాయి. తక్కువ ధరలో రోజూ లక్షలాది మంది ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణాలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక భారతీయ రైల్వే ఎన్నో వింతలు, ప్రత్యేకతలను కలిగి ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగిన ఓ రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో సముద్ర మట్టానికి దిగువన ఉన్న రైల్వే స్టేషన్
భారతదేశంలో సముద్ర మట్టానికి దిగువన ఉన్న ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఇది. దీని పేరు కుట్టనాడ్ రైల్వే స్టేషన్ (Kuttanad Railway Station). ఇది కేరళ రాష్ట్రంలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ సముద్ర మట్టానికి 2.3 మీటర్ల (-7.5 అడుగులు) దిగువన ఉంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
వర్కల వర్సెస్ కుట్టనాడ్.. ఏది కరెక్ట్?
చాలా మంది కేరళలోని వర్కల స్టేషన్ సముద్ర మట్టానికి దిగువన ఉన్న రైల్వే స్టేషన్ అనుకుంటారు. ఇంటర్నెట్ లోనూ కొన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. కానీ, తిరువనంతపురం జిల్లాలో ఉన్న వర్కల స్టేషన్.. సముద్ర మట్టానికి పైన దాదాపు 20-30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి దిగువన ఉన్న రైల్వే స్టేషన్‌గా కుట్టనాడ్ గుర్తింపు పొందింది. కుట్టనాడ్ ప్రాంతం వరి సాగుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ సముద్ర మట్టానికి దిగువన వ్యవసాయం చేస్తారు. ఇది ప్రపంచంలో అరుదైన వ్యవసాయ ప్రాంతాలలో ఒకటిగి గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: మెట్రోలోకి డ్రైవర్ లెస్ ట్రైన్స్ వచ్చేశాయ్, చూడ్డానికి భలే ఉన్నాయే!
సముద్ర మట్టానికి అత్యంత దిగువన ఉన్న స్టేషన్ కీవ్‌స్కా స్టేషన్!
అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ గా కుట్టనాడ్ గుర్తింపు తెచ్చుకోగా, సముద్ర మట్టానికి అత్యంత దిగువన ఉన్న రైల్వే స్టేషన్ గా ఉక్రెయిన్ లోని కీవ్ స్కా స్టేషన్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ సముద్ర మట్టానికి సుమారు 87 మీటర్ల(285 అడుగుల) దిగువన ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. దీని లోతు కీవ్ నగరం భౌగోళిక స్థానం, డినీపర్ నది సమీపంలో ఉన్న కొండలు, లోతైన లోయల కారణంగా ఏర్పడింది. ఈ స్టేషన్ భౌగోళిక కారణాల వల్ల సముద్ర మట్టానికి దిగువన నిర్మించబడింది. ఇది సాధారణంగా భూగర్భ రవాణా వ్యవస్థలలో భాగంగా ఉంది.
Read Also: దేశంలోనే అతి పొడవైన రైల్వే టన్నెల్, అమ్మో అన్ని కిలోమీటర్లా?