Kingdom Movie : విజయ్ దేవరకొండ ఎన్నో హోప్స్ పెట్టుకున్న కింగ్‌డం మూవీ నిన్న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో నెగిటిల్ టాక్. మరి కొన్ని ఏరియాల్లో మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా.. కింగ్‌డం మూవీ టీం వాళ్లు అయితే, నిన్న ఈవీనింగ్ సక్సెస్ మీట్ పెట్టారు. అయితే ఈ సక్సెస్ మీట్‌కి హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే అటెండ్ కాలేదు. దీనిపై ఇండస్ట్రీలో ఎన్నో అనుమానాలకు తావు ఇచ్చింది. అవి ఏంటి ? అసలేం జరుగుతుంది ? అనేవి ఇప్పుడు చూద్దాం.
జర్సీ సినిమాతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన మూవీ కింగ్‌డం. హరి హర వీరమల్లు సినిమా వల్ల పలు మార్లు వాయిదా పడుతూ… ఫైనల్‌గా జూలై 31న థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే ఈ సినిమాకు చాలా ఏరియాల్లో నెగిటివ్ టాక్ వస్తుంది.
కొన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వచ్చినా… దాని ప్రభావం మాత్రం పెద్దగా లేదు. కానీ, కింగ్‌డం మూవీ యూనిట్ మాత్రం నిన్న (గురు వారం) సక్సెస్ మీట్ జరిపారు. ఈ సక్సెస్ మీట్.. విజయ్ దేవరకొండ మాటలు.. నిర్మాత నాగ వంశీ పంచ్‌లు అన్నీ పక్కన పెడితే… ఈ సక్సెస్ మీట్‌కి హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే రాలేదు. దీనిపై ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.
కింగ్‌డంపై హీరోయిన్ అలక..?
నిన్న జరిగిన సక్సెస్ మీట్‌కు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే రాలేకపోవడానికి కారణం… సినిమానే అని తెలుస్తుంది. సినిమాలో భాగ్య శ్రీ బోర్సే పాత్ర నిడివి తక్కువగా ఉంది. అలాగే హీరోతో ఉన్న ఓ సీన్ పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే అలిగినట్టు తెలుస్తుంది.
తనకు చెప్పిన కథ, తీసిన సీన్స్.. సినిమాలో లేవని హీరోయిన్ తన సన్నిహితుల దగ్గర వాపోతుందట. అలాగే హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, నిర్మాత నాగ వంశీలపై కూడా కోపంతో ఉందని తెలుస్తుంది. అందుకే నిన్న జరిగిన కింగ్‌డం మూవీ సక్సెస్ మీట్‌కు హీరోయిన్ రాలేదని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
అయితే అలక గురించి గానీ, సన్నివేశాల గురించి గానీ మూవీ టీం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ వార్తలు నిజమా కాదా అని తెలియాలంటే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే స్పందించాల్సిందే.