BigTV English

NZ vs BAN : బంగ్లా బౌలర్ల ధాటికి కివీస్ విలవిల.. మూడో వన్డేలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌..

NZ vs BAN : బంగ్లా బౌలర్ల ధాటికి కివీస్ విలవిల.. మూడో వన్డేలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌..

NZ vs BAN : నేపియర్‌లో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ సీమర్లు చెలరేగడంతో ఆతిథ్య జట్టు చిత్తుగా ఓడింది. బంగ్లా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్‌ 98 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్ వైట్‌వాష్‌ నుంచి తప్పించుకుంది. బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు.


చివరదైన మూడో వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నాలుగో ఓవర్లో న్యూజిలాండ్‌ పతనం ప్రారంభమైంది. హసన్ షకిబ్ బౌలింగ్ లో రచిన్ రవీంద్ర 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రీ నికోల్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్ విల్ యంగ్ (26).. కెప్టెన్ టామ్ లాథమ్(21) తో కలసి బంగ్లా పేసర్లను కొద్దిసేపు నిలువరించారు.ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని షోరిఫుల్ ఇస్లాం తెరదించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ పేకమేడలా కూలిపోయింది. మొత్తంమీద 31.4 ఓవర్లలో కివీస్ జట్టు 98 పరుగులకు ఆలౌట్ అయ్యంది.

బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, హసన్ షకిబ్, సౌమ్యా సర్కార్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. ముస్తఫిజుర్ ఒక్క వికెట్ తీసుకున్నాడు. కివీస్ బ్యాటర్లలో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. విల్ యంగ్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.


99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ధాటిగా ఆడింది. ఓపెనర్ సౌమ్యా సర్కార్ నాలుగు పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యిడు. బంగ్లా కెప్టెన్ షాంతో హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 15.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో షాంతో (51*), అనాముల్ హక్ (37) పరుగులు చేశారు.

మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-1తో కైవసం చేసుకుంది. హసన్ షకిబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ పొందగా..కివీస్ బ్యాటర్ విల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కించుకున్నాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×