E-Paper
Advertisement

KKR: KKR రిలీజ్ చేసే ప్లేయర్లు వీళ్ళే… SRH లోకి వెంకటేష్ అయ్యర్?

KKR: KKR రిలీజ్ చేసే ప్లేయర్లు వీళ్ళే… SRH లోకి వెంకటేష్ అయ్యర్?
Advertisement

KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 మినీ వేళానికి సన్నాహాకాలు ప్రారంభమయ్యాయి. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. నవంబర్ 15 {నేడు} రిటెన్షన్ జాబితాలు సమర్పించాల్సి ఉండగా.. ఆ తర్వాత కూడా ట్రేడ్ విండోలు తెరిచే ఉంటాయని సమాచారం. డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరగబోతోంది.

Also Read: Shoaib Malik: నాలుగో పెళ్లి చేసుకుంటున్న పాకిస్తాన్ క్రికెటర్.. ముగ్గురికి విడాకులు?

Advertisement

అయితే ఐపీఎల్ 2025 మెగా వేలం కంటే.. ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ అభిమానులలో ఎక్కువ ఉత్కంఠ రేపుతోంది. ఈసారి పలువురు స్టార్ క్రికెటర్ల భవితవ్యం నిర్ణయించనుండడంతో క్రికెట్ అభిమానులలో తీవ్ర ఆసక్తి పెరిగింది. రిటెన్షన్ జాబితా ప్రకటించిన తర్వాత కూడా జట్లు ట్రేడ్ విండోలో మార్పులు చేయవచ్చు. ఒకవేళ ఏవైనా రెండు ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను స్వాప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు.

KKR షాకింగ్ నిర్ణయం:

2026 మినీ యాక్షన్ కి ముందు కలకత్తా నైట్ రైడర్స్ {KKR} షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కలకత్తా నైట్ రైడర్స్ నుంచి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. కేకేఆర్ ఫ్రాంచైజీ ఐపీఎల్ మినీ వేళానికి ముందు కొంతమంది కీలక ఆటగాళ్లను విడుదల చేయడం ఖాయమైంది. కొంతమంది స్టార్ ఆటగాళ్లను విడుదల చేసి.. వేలంలో పాల్గొనడానికి దాదాపు 40 కోట్ల మొత్తంతో కలకత్తా నైట్ రైడర్స్ ఓ ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఐపీఎల్ మెగా యాక్షన్ లో 23.75 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసిన స్టార్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని ఆ జట్టు విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక గత ఏడాది వెంకటేష్ అయ్యర్ పేలవమైన ప్రదర్శన ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2021 నుండి కేకేఆర్ తరఫున ఆడుతున్న వెంకటేష్ ని విడుదల చేసినప్పటికీ.. యాక్షన్ లో తక్కువ ధరకు మళ్ళీ కొనుగోలు చేయాలని కేకేఆర్ ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. అయితే వెంకటేష్ అయ్యర్ తో పాటు అన్రిచ్ నోర్ట్జే {6.5 కోట్లు}, క్వింటన్ డికాక్ {3.6}, స్పెన్సర్ జాన్సన్ {2.8}, రెహమాన్ ఉల్లా గుర్బాజ్ {2}, మోయిన్ అలీ {2} వంటి ఇతర కీలక ఆటగాళ్లను కూడా కేకేఆర్ విడుదల చేసే అవకాశం ఉందని వదంతులు వినిపిస్తున్నాయి.

కేకేఆర్ పర్స్ ఖాళీ చేసుకునే అవకాశం:

Advertisement

కీలక ఆటగాళ్లను విడుదల చేస్తూ కేకేఆర్ జట్టు కొత్త కాంబినేషన్స్ కోసం.. అలాగే వేలంలో పెద్ద బిడ్డింగ్ కి పర్స్ ఖాళీ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ ని విడుదల చేయడం ద్వారా కేకేఆర్ జట్టు పస్సులోకి ఏకంగా 23.75 కోట్ల భారీ మొత్తం తిరిగి చేరుతుంది. అలాగే ఇతర ఆటగాళ్లను కూడా రిలీజ్ చేయడంతో మరో 17 కోట్లు కేకేఆర్ పర్సులో చేరుతుంది. ఇలా వచ్చిన 40 కోట్ల డబ్బుతో జట్టు యాక్షన్ లో ఇతర కీలక ఆటగాళ్లను లేదా కెప్టెన్సీ ఎంపికలను కొనుగోలు చేయడానికి వీలవుతుంది.

Also Read: Mohammed Shami: బీహార్ ఎన్నిక‌ల‌పై మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ వివాద‌స్పద వ్యాఖ్య‌లు.. నితీష్ జీ అంటూ !

గత ఐపీఎల్ 2025 సీజన్ లో వెంకటేష్ అయ్యర్ ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. అతడు ఆడిన 11 మ్యాచ్ లలో కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగాడు. భారీ మొత్తంతో కొనుగోలు చేసిన ఆటగాడి నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోవడంతో.. అతడిని విడుదల చేయాలని ప్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ట్రేడ్ ప్రక్రియ ద్వారా వెంకటేష్ అయ్యర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం.

 

 

View this post on Instagram

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×