IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( Indian Premier League 2025 Tournament ) సంబంధించిన బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన ప్రారంభ మ్యాచులు ఎప్పుడు జరగనున్నాయన్న దానిపైన… ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా టోర్నీకి సంబంధించిన మ్యాచులు.. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 21వ తేదీన ఓపెనింగ్ సెర్మని ఉండబోతుంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో ఒక కథనాలు వస్తున్నాయి. తాజాగా క్రిక్ బజ్ వెల్లడించిన వివరాల ప్రకారం… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) జట్ల మధ్య మార్చి 22వ తేదీన ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
Also Read: Champions trophy: బీసీసీఐ క్రూరత్వం.. టీమిండియా ప్లేయర్లకు సుఖం లేకుండా చేస్తున్న కొత్త రూల్స్ ?
ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens ) వేదికగా సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రోజు అంటే మార్చి 23వ తేదీన..సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) మధ్య… రెండవ మ్యాచ్ జరగనుంది. అయితే దాదాపు రెండు రోజుల గ్యాప్ తర్వాత… అంటే మార్చి 26వ తేదీన కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. మార్చి 30వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైట్ ఉంటుంది. మార్చి 26వ తేదీ అలాగే మార్చి 30వ తేదీన జరగాల్సిన మ్యాచులు గువాహాటి వేదికగా జరగబోతున్నాయి. ఐపీఎల్ 2025 టోర్నమెంటు నేపథ్యంలో ధర్మశాల స్టేడియం… ఈసారి ఏకంగా మూడు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వబోతుంది. క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ హైదరాబాదులో జరగనున్నట్లు… క్రిక్ బజ్ వెల్లడించింది. అందరూ ఊహించినట్లుగానే ఫైనల్ మ్యాచ్ కోల్ కతా వేదికగా జరగనుంది.
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens ) వేదికగా మే 25వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరుగుతుంది. అయితే పైన ప్రకటించిన తేదీలు అలాగే మ్యాచుల గురించి… ఐపీఎల్ నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. వీటి వివరాలను వారం రోజుల్లోపు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 21వ తేదీ నుంచి.. మే 20వ తేదీ వరకు దాదాపు 75 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నమెంటులో ఏకంగా… పది ఫ్రాంచైజీ జట్లు పాల్గొనబోతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన.. లైవ్ స్ట్రీమింగ్ మొత్తాన్ని… జియో సినిమాలో మనం ఉచితంగా చూడవచ్చు. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా జియో సినిమాలో ( JioHotstar ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League 2025 Tournament ) మనకు ఉచితంగా ప్రసారం అవుతోంది. ప్రత్యేకంగా రీఛార్జి చేసుకోవాల్సిన పనిలేదు.
Also Read: Pakistan Fans: ఫ్రీగా బీర్లు దొరికినట్లు.. స్టేడియంలోకి ఎగబడుతున్న పాకిస్థాన్ ఫాన్స్!
IPL 2025 UPDATES (Cricbuzz):
– RCB Vs KKR on 22nd March.
– SRH Vs RR on 23rd March.
– RR Vs KKR on 26th and RR Vs CSK on 30th March in Guwahati.
– Dharamshala likely to host 3 matches.
– Qualifier 1 & Eliminator in Hyderabad.
– Final on 25th May in Kolkata. pic.twitter.com/Rp3vhkpi1w— Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2025