Champions trophy: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మరో వారం రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి… ఈ మెగా టోర్నీ జరగనుంది. మార్చి 9వ తేదీ వరకు చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కొనసాగనుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా ప్లేయర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ప్లేయర్లకు సుఖం లేకుండా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్ ప్రవేశపెట్టింది.
Also Read: Pakistan Fans: ఫ్రీగా బీర్లు దొరికినట్లు.. స్టేడియంలోకి ఎగబడుతున్న పాకిస్థాన్ ఫాన్స్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -2025 టోర్నమెంట్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో… టీమిండియా ప్లేయర్ల పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది బీసీసీఐ. రంజీ ట్రోఫీలు ఆడాల్సిందేనని… అలాగే.. ప్రైవేట్ కార్లలో అస్సలు.. స్టేడియాలకు రాకూడదని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ల భార్యలు… విదేశీ టూర్లకు వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఒకవేళ వెళ్తే రెండు వారాలకు మించి ఉండకూడదని కండిషన్ పెట్టింది. అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… టీమిండియా భార్యల పైన ఆంక్షలు అమలు చేస్తోంది బీసీసీఐ. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటు దుబాయ్ వేదికగా జరగబోతుంది.
వాస్తవానికి ఈ టోర్నమెంట్ ఆతిథ్యం ఇచ్చేది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ దేశానికి టీమిండియా వెళ్లకపోవడంతో ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. అంటే టీమిండియా ఆడే మ్యాచ్ లన్ని దుబాయిలో జరుగుతాయి. మిగిలిన మ్యాచ్ లన్ని పాకిస్తాన్ దేశంలోనే నిర్వహించనుంది ఐసీసీ. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీన.. అంటే ఎల్లుండి దుబాయ్ కి వెళ్లనుంది టీం ఇండియా. దుబాయ్…. వెళ్లేటప్పుడు సింగిల్ గా మాత్రమే వెళ్లాలని… బీసీసీఐ ఆంక్షలు విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో బ్యాచిలర్ లైఫ్ అనుభవించాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి.. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో ఫిబ్రవరి 15వ తేదీన దుబాయ్ కి సింగిల్ గా వెళ్ళనున్నారు టీమిండియా ప్లేయర్లు.
కాగా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ తో… లీగ్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఆ తర్వాత పాకిస్తాన్ దేశంతో తలపడనుంది. దీంతో… పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ పైన అందరి దృష్టి పడింది. ఈ మ్యాచ్ ఎలాగైనా వీక్షించాలని చాలామంది ఫ్యాన్స్ ఇప్పటినుంచే… ప్లాన్స్ వేస్తున్నారు. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ పైన బెట్టింగ్స్ కూడా ఇప్పటినుంచి ప్రారంభమయ్యాయి. ఎలాగైనా టీమిండియా గెలవాలని… చాలామంది ఫ్యాన్స్ పూజలు కూడా చేస్తున్నారు. ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన వన్డే సిరీస్ లో… రోహిత్ శర్మ సేన అద్భుతంగా రాణించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి తోపు ప్లేయర్లు అందరూ ఫామ్ లోకి కూడా వచ్చారు. ఛాంపియన్ ట్రోపీ 2025 టోర్నమెంట్ కంటే ముందు… నిర్వహించిన ఇంగ్లాండు వన్డే సిరీస్ టీమ్ ఇండియాకు చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు. టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం ఫామ్ లోకి రావడంతో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… రోహిత్ శర్మ సేన గెలుస్తుందని అందరూ అంటున్నారు.
Also Read: India Wicketkeeper – Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పంత్ ఔట్.. రాహుల్ కే ఛాన్స్ !
🚨 NO FAMILES IN CHAMPIONS TROPHY FOR TEAM INDIA 🚨
– Families will not travel with Team India's players for the Champions Trophy 2025 in Dubai. (PTI). pic.twitter.com/mY26kELWSi
— Tanuj Singh (@ImTanujSingh) February 13, 2025